సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి తన బలమేంటో నిరూపించాడు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాభాలు తెప్పించగలడని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో దర్బార్ సినిమాతో తైలవా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగు తమిళ్ హిందీ లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకొని 200కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ కెరీర్ లో ఇంతకుముందు రోబో - కబాలి - 2.ఓ - పేట సినిమాలు 200కోట్లు దాటాయి. ఇక ఇప్పుడు దర్బార్ కూడా ఆ రికార్డ్ నెంబర్స్ ని పెంచారు. ఇకపోతే సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ వచ్చిందా అంటే అదేమీ లేదు.

తెలుగులో పలు ఏరియాల్లో ప్రాఫిట్స్ జోన్ లోకి తెచ్చిన దర్బార్ అనుకున్నంతగా అయితే కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. తెలుగులో తైలవా గత సినిమాలకంటే దర్బార్ కొంచెం మంచి ఓపెనింగ్స్ ని అయితే అందుకుంది. ఇక సినిమాలో అభిమానులకు నచ్చే యాక్షన్స్ సీన్స్ ని కలెక్షన్స్ పెంచడంలో కీలకపాత్ర పోషించాయి. సెకండ్ హాఫ్ కూడా అంచనాలకు తగ్గట్టు ఉంటే మరో లెవెల్లో ఉండేదని ఎనలిస్ట్ లు భావిస్తున్నారు.