అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గ ఏంట్రీ ఇచ్చిన రిచ్ కిడ్ బెల్లకొండ శ్రీనివాస్ సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుతున్నాడు గాని తన మార్కెట్ ను మాత్రం పెంచుకోవడం లేదు. చేసిన ప్రతి సినిమా కమర్షియల్ యాంగిల్ లోనే ట్రై చేసినవే. అయితే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇటీవల వచ్చిన రాక్షసుడు సినిమా పరవాలేధనిపించే విధంగా పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేవు.

మెంటల్ గా టార్చర్ చేశాడు.. ఇలియానా కామెంట్స్!

అయినప్పటికీ మొదటి సారి మంచి టాక్ అందుకున్నాడని బెల్లకొండ అబ్బాయిని ఒక రేంజ్ లో హైలెట్ చేశారు. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నీ అందుకోవాలని ఈ హీరో కష్టపడుతున్నాడు. బెల్లకొండ నటనాపరంగా చాలా వరకు అప్గ్రేడ్ అవ్వాలని కామెంట్స్ వచ్చాయి. అయితే వాటన్నిటికీ ఒకే ఒక్క సినిమాతో సమాధానం ఇస్తానని అంటున్నాడు. ఏదైతే మిస్ అయ్యింది అంటున్నారో ఆ స్టైల్ లోనే రాబోతున్నట్లు ఆన్సర్ ఇచ్చాడు.

 

అలాగే తన న్యూ లుక్ ని రిలీజ్ చేసిన  బెల్లంకొండ ఆడియెన్స్ కూడా తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. నిండు గెడ్డంతో 6 ప్యాక్ రెడీ చేసుకున్న బెల్లకొండ చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే నెక్స్ట్ సినిమాలో మునుపెన్నడు చేయని పాత్రలో నటిస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం బెల్లకొండ సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నాడు. డిసెంబర్ లో ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అందుకోసమే బెల్లంకొండ ఈ విధంగా మార్పులు చేశాడు. మరి ఆ కొత్త ప్రాజెక్ట్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.