ప్రపంచాన్ని ఊపేస్తోంది కరోనా వైరస్. ఎక్కడ చూసినా ఆ వైరస్ కు సంభందించిన వార్తలే వస్తున్నాయి. చాలా దేశాలు భయంతో వణుకుతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున తన సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ చేసుకున్నట్లు సమాచారం. కరోనాతో భీతిళ్లుతున్న దేశాలకు వెళ్లటం రిస్క్ అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ నాగ్ షూటింగ్ పెట్టుకుందామనకున్న దేశం థాయిల్యాండ్. అక్కడ ఇరవై రోజులు షూటింగ్ ప్లాన్ చేసారు. ఆ సినిమా వైల్డ్ డాగ్.

కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో దేశం కదిలి వెళ్లకపోవటమే బెస్ట్ అని నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. థాయిల్యాండ్ అంతా ఇప్పుడు కరోనా వైరస్ తో భయాందోళనతో ఉంది. పోనీ లొకేషన్ మార్చి షూట్ చేద్దామంటే అక్కడే ఖచ్చితంగా తీయాల్సిన సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. దాంతో నాగ్ అప్ సెట్ అయ్యారట. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ సమస్య తీరిన తర్వాత అక్కడకి వెళ్దామని టీమ్ కు చెప్పి లోకల్ గా చెయ్యాల్సిన షూటింగ్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని చేసిన `మన్మథుడు-2` డిజాస్టర్ అవటంతో .. నిరాశ చెందిన `కింగ్` నాగార్జున కొంత కాలం గ్యాప్ తీసుకున్నారు.  ఆ తర్వాత `బిగ్‌బాస్` మూడో సీజన్‌తో బిజీ అయ్యారు. ఇప్పుడు నూతన దర్శకుడు అహిషోన్ సోలమన్ సినిమాకు ఓకే చెప్పి షూటింగ్ మొదలెట్టారురు. ఇప్పటికే  ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలే చేసారు. ఈ సినిమాకు `వైల్డ్‌డాగ్` అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

వితికని పక్కనే పెట్టుకుని.. ఇలియానాపై వరుణ్ హాట్ కామెంట్స్!
 
ఇక ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మగా కనిపించనున్నారు. `గగనం` తర్వాత నాగార్జున ఈ తరహా పాత్రలో కనిపించనుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలే పెట్టుకున్నారు. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.