పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు.. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న బండ్ల గణేష్ ఒక్కసారిగా పూనకంతో ఊగిపోతాడు. తాజాగా బండ్ల గణేష్ పవన్ పై మరోసారి తన అభిమానం చాటుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బంద కలసి నటించిన చిత్రం తీన్ మార్. 

ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. తీన్ మార్ చిత్రం విడుదలై నేటితో 9 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తీన్ మార్  చేసుకుంటూ పవన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతే కాదు తీన్ మార్ చిత్రంపై బండ్ల గణేష్ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. 

టాలీవుడ్ మోస్ట్ వాంటెండ్ కమెడియన్.. అఖిల్ నుంచి చిరంజీవి వరకు..

తీన్ మార్ మూవీ నా జీవితంలో ప్రత్యేకమైనది. ఈ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ నిర్మాణం పరంగా ఈ చిత్రం నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ఈ చిత్రాన్ని కాశీ, మైసూర్, అమెరికా, సౌత్ ఆఫ్రికా, థాయ్ ల్యాండ్ లాంటి అద్భుతమైన ప్రాంతాల్లో చిత్రీకరించాం. ఈ చిత్రంలో హృదయాన్ని హత్తుకునే డైలాగులు ఉన్నాయి. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. 

అర్జున్ పాల్వాయిగా, మైఖేల్ వేలాయుధంగా మా బాస్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు అని బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేశాడు.