ఒకప్పుడు కమెడియన్ గా సినిమాలు చేసిన బండ్ల గణేష్.. ఆ తరువాత నిర్మాతగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కానీ కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్లిపోయి తన వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో పాలిటిక్స్ అని వెళ్లినా వర్కవుట్ కాలేదు.

'7'o clock' బ్లేడ్ ఎపిసోడ్ తో బండ్ల అంటే అందరూ కామెడీ చేయడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో దర్శకుడు అనీల్ రావిపూడి బండ్లని తీసుకొచ్చి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కమెడియన్ గా తీసుకున్నాడు. చాలా కాలం తరువాత మేకప్ వేసుకోవడానికి బండ్ల కూడా బాగా ఉత్సాహపడ్డాడు.

మీకు అర్దమౌతోందా... ‘సరిలేరు..’ టీమ్ కొత్త స్కెచ్!

మళ్లీ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి సినిమా రంగంలో ఉండాలన్న తన కోరికని తీర్చుకుందామని అనుకున్నాడు. కానీ అతడి ఆశలపై నీళ్లు జల్లేశారు ప్రేక్షకులు. సినిమాలో బండ్ల పాత్ర దారుణంగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. దీంతో బండ్ల డీలా పడిపోయాడు. అతడి సర్కిల్ లో బండ్లపై కామెంట్స్ వేయడం మొదలుపెట్టారట.

ఆయన పిల్లలు కూడా 'నీకీ వేషం అవసరమా నాన్నా' అని అడగడంతో బండ్ల బాగా ఫ్రస్టేట్ అయినట్లు సమాచారం. దర్శకుడు అనీల్ రావిపూడిపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తనను సినిమాలో తక్కువ చేసి చూపించాడని.. అమ్మా నాన్నలు, బంధువులు.. ఆఖరికి తన పిల్లల ముందు కూడా పరువు పోయేలా చేశాడని బాధ పడుతున్నాడట. తొంభై శాతమ క్యారెక్టర్ ని తీసేసే ఉద్దేశం ఉన్నప్పుడు, మొత్తం తీసేసినా తాను బాధపడేవాడిని కాదని అంటున్నాడట. తన దగ్గర ఎవరైనా సినిమా టాపిక్ తీసుకొస్తే చాలు.. అనీల్ రావిపూడిని తిట్టుకుంటూ మాట్లాడుతున్నాడట.