ప్రముఖ నిర్మాత పీవీపీ.. బండ్ల గణేష్ పై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. 'టెంపర్' సినిమాకి గాను బండ్ల గణేష్ తన దగ్గర ముప్పై కోట్లు తీసుకున్నాడని.. రిలీజ్ సమయంలో కొంత మొత్తం ఇచ్చిన బండ్ల గణేష్ మిగిలిన దానికి చెక్కులు ఇచ్చారని.. ఇప్పుడు మిగిలిన డబ్బు తిరిగివ్వాలని అడుగుతుంటే తన ఇంటికి మనుషులను పంపి బెదిరించారని పీవీపీ 
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.

అయితే ఈ కేసులో బండ్ల గణేష్ వెర్షన్ మరో విధంగా ఉంది. గతంలో పీవీపీ డబ్బులు కావాలని కోర్టుకి వెళ్లారని.. దానికి సంబంధించిన కేసుని కోర్టులో కొట్టేశారని బండ్ల గణేష్ అంటున్నారు. తనకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందని అన్నారు. విజయవాడ మొత్తం తన చేతుల్లోనే ఉందని, తనేం చెబితే అది జరుగుతుందని పీవీపీ అంటున్నారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

తన ఇంటికి వచ్చి రెక్కీ చేసి వెళ్లారని బండ్ల గణేష్.. పీవీపీపై ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత వేధింపులు పెరిగాయని అంటున్నారు. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బండ్ల గణేష్ చెప్పారు. పోలీసులు పీవీపీని పిలిపించి మాట్లాడతామని చెప్పారని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. 

పరారీలో బండ్ల గణేష్.. పోలీసుల గాలింపు!