నిర్మాత నటుడు బండ్లగణేష్ కి మొత్తానికి బెయిల్ లభించింది, గత కొన్ని రోజులుగా చెక్ బౌన్స్ కేసులతో సతమతమవుతున్న గణేష్ ని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు కోర్టుకు హాజరు కావాలని హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో కడప కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కడప మేజిస్ట్రీట్ కోర్టు ఇటీవల బెయిల్ కి నిరాకరించి రిమాండ్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే బండ్ల గణేష్ తరపు న్యాయవాది బాధిత సభ్యులతో రాజి ఒప్పందాన్ని కుదుర్చారు. ముందుగా 4 లక్షల వరకు అడ్వాన్స్ ఇప్పించారు. మిగతా డబ్బును వచ్చే నెల 14 లోపు చెల్లిస్తామని చెప్పారు. వెంటనే బెయిల్ కు పిటీషన్ దాఖలు చేయడంతో కడప మొబైల్ కోరు మేజిస్ట్రీట్ బెయిల్ మంజూరు చేసింది.   2013లో మహేష్ అనే వ్యక్తి గణేష్ పై చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. తీసుకున్న డబ్బు ఇవ్వలేదని పేర్కొనడంతో పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు.

గతంలో కేసు విషయంలో కోర్టుకు హాజరుకాకపోవడంతో మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ చిత్రంతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ తర్వాత అతడి నిర్మాణంలో అనేక విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.  ఇదిలా ఉండగా బండ్ల గణేష్ 2015లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టెంపర్ అనే చిత్రాన్ని నిర్మించాడు.

read also: నన్నెవరూ అరెస్ట్ చేయలేదు.. నేనే మీకు చెబుతా: బండ్ల గణేష్!

ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. టెంపర్ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో బండ్ల గణేష్ చుక్కుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కు బండ్ల గణేష్ కు మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.