బాలీవుడ్ బుల్లితెర నటి షీతల్ ఖందల్ తన సహ నటుడు సిద్ధార్థ్ శుక్లాపై సంచలన కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేశారు. షీతల్, సిద్ధార్థ్ కలిసి పాపులర్ సీరియల్ 'బాలికా వధు'లో నటించారు.

హిందీలో దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగిన ఈ సీరియల్ తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' పేరుతో డబ్ చేసి ప్రసారం చేశారు. తెలుగులో కూడా ఈ సీరియల్ ప్రేక్షకదారణ పొందింది. ఆ సీరియల్ గాయత్రి పాత్ర పోషించిన షీతల్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సిద్ధార్థ్ శుక్లాపై ఆరోపణలు చేసింది. 

Mahesh Babu: మహేష్ మరీ ఇంత కమర్షియలా?.. ఏకంగా ఫ్యామిలీని దించేశాడు!

సిద్ధార్థ్ తనను సెట్లో తనను అనేకసార్లు అనుచితంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ శుక్లా హిందీ బిగ్ బాస్ 13లో కంటెస్టంట్ గా పాల్గొన్నాడు. ఈ షోలో నటి ఆర్తి సింగ్ పై సిద్ధార్థ్ డే కొన్ని అసభ్యకర కామెంట్స్ చేయగా.. అతడికి వ్యతిరేకంగా సిద్ధార్థ్ శుక్లా మాట్లాడడం తనకు ఆశ్చర్యంగా ఉందని షీతల్ వ్యంగ్యంగా మాట్లాడింది. నిజానికి శుక్లా తనతో ప్రవర్తించిన తీరుతో పోలిస్తే సిద్ధార్థ్ డే మాట్లాడిన మాటలు చాలా తక్కువ అని చెప్పారు.

షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ తనపై అసభ్యకరమైన జోకులు వేసేవాడని, ఎవరితో పంచుకోలేని పదాలను సైతం ఉపయోగించే వాడని.. తనతో అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చింది.

 

ఒకరోజు షూటింగ్ లో తనను తాకిన విధానం అసహ్యం కలిగించిందని.. అది తనకు మొదటి సీరియల్ కాబట్టి ఏం చేయలేకపోయానని షీతల్ చెప్పుకొచ్చింది. అయితే తరువాత చాలా సార్లు సీరియల్ నిర్మాతకు సిద్ధార్థ్ పై ఫిర్యాదు చేసినట్లు చెప్పింది షీతల్. అప్పటినుండి సిద్ధార్థ్ తనకు వ్యతిరేకంగా మాట్లాడడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది.