మన టాలీవుడ్ హీరోల్లో చాలా మందికి బట్టతల వచ్చేసింది. కానీ వారు మాత్రం అది బయటపడకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా మంది విగ్ లతో మేనేజ్ చేస్తుంటే.. మరికొందరు అధునాతన పద్దతుల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు.

కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఊకో సినిమాకి ఒక్కో రకమైన విగ్గు పెడుతూ మైంటైన్ చేస్తున్నారు. బయట కూడా విగ్గుని కొనసాగిస్తున్నారు. ఆ విగ్గులు బాలయ్యకి సూట్ కాకపోవడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా 'రూలర్' సినిమాలో ఓ పాత్ర కోసం బాలయ్య వాడిన విగ్గు దారుణంగా ఉండడంతో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.

త్రివిక్రమ్ సినిమాలో బాలకృష్ణ.. జరిగే పనేనా?

అయితే ఇప్పుడు బాలయ్యకి విగ్గు కష్టాలు తీరబోతున్నాయని తెలుస్తోంది. మిగతా హీరోల్లానే ఆయన కూడా నెత్తిన శాశ్వత జుట్టు పెట్టించుకోబోతున్నారట. దీనికోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోనున్నారట. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రమోట్ చేసిన దుబాయ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సంస్థలో బాలయ్యకి జుట్టు పెట్టించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

త్వరలోనే ఆయన దుబాయ్ కి వెళ్లి జుట్టు పెట్టించుకొని రాబోతున్నారు. ఒరిజినల్ గా అనిపించేలా అత్యున్నత స్థాయిలో, ఎక్కువ ఖర్చుతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయిస్తున్నారని.. అది వర్కవుట్ అయితే ఇక బాలయ్యకి విగ్గు కష్టాలు తీరినట్లేనని చెబుతున్నారు. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.