అల.. వైకుంఠపురములో.. సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి ఫామ్ లోకి వచ్చేశాడు. అలాగే త్రివిక్రమ్ కెరీర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇండియాలో పాన్ ఇండియన్ సినిమాలు సైతం అందుకొని విధంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. 200కోట్ల నెట్ వసూళ్ళు అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాకు సంబందించిన గాసిప్స్ అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కడుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా త్రివిక్రమ్ బాలకృష్ణను ఒక పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మాటల మాంత్రికుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాకు సంబందించిన స్టోరీ లైన్ నుంచి టైటిల్ వరకు ప్రతి ఒక్కటి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  అదే విధంగా ఆ సినిమాలో బాలకృష్ణ గెస్ట్ రోల్ లో కనిపించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ తారక్ ని ఎక్కువగా ఇష్టపడరని ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నమాటే. వారు కలిసి నటిస్తే ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అదే జరిగేపనేనా? అనే మాట రాకుండా ఉండదు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాలో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తుండడంతో ఒక్కసారిగా ఆ వార్తలు వైరల్ గా మారాయి. మరీ ఆ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరీకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.