వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోయే సినిమాలు వరుసగా డేట్లు అనౌన్స్ చేశాయి. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ఒకేసారి థియేటర్ లోకి రానున్నాయని చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ అయింది. కానీ ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయంటే.. థియేటర్లు, ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.

దీంతో ఈ విషయంలో ఎవరు రాజీ పడతారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సంక్రాంతి సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. తాజా  పరిణామాలతో సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. థియేటర్లు లాక్ అయ్యాయి. ముందుగా రజినీకాంత్ 'దర్బార్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'RRR': ఎన్టీఆర్ హీరోయిన్ జెన్నిఫర్ ఫోటోలు!

మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని మొదటి జనవరి 10 లేదా 11న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాని జనవరి 9న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక మహేష్ బాబు, బన్నీ సినిమాల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ఈ రెండు సినిమాలు ఒకేరోజు రావాలనుకున్నారు.

కానీ దిల్ రాజుతో పాటు మరికొందరు సినీపెద్దలు కూర్చొని సయోధ్య కుదిర్చారు. అలా మహేష్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న థియేటర్లోకి వస్తుంది. మహేష్ సినిమా వచ్చిన 24 గంటల్లో అంటే జనవరి 12న బన్నీ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన థియేటర్ల సర్దుబాటు కూడా పూర్తయింది.

ఈ రెండు సినిమాలతో పాటు కళ్యాణ్ రామ్ నటిస్తోన్న 'ఎంత మంచివాడవురా' సినిమా జనవరి 15న థియేటర్ లోకి తీసుకొస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి పోటీ మొదలైంది. ఏఏ సినిమాలు ఏఏ తారీఖులలో వస్తున్నాయనే విషయంపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ విషయాలను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.