Asianet News TeluguAsianet News Telugu

'రూలర్'.. బాలయ్య పరిస్థితి మరీ ఇంత దారుణమా..?

ఈ ఏడాదిలో బాలకృష్ణ నటించిన 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు 'రూలర్' సినిమా వాటికి ధీటుగా పతనం చూస్తోంది. తొలిరోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లకు పైగా షేర్ సాధించింది. 
 

Balakrishna's Ruler: Most disappointing Telugu movie
Author
Hyderabad, First Published Dec 23, 2019, 3:47 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. నిజానికి బాలయ్య కెరీర్ లో ఇంత దారుణంగా ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాతో దారుణమైన రిజల్ట్ ని చూడాల్సి వచ్చింది.

సినిమా రిలీజైన మొదటి వీకెండ్ లో ఒక ఫుల్ డే వసూళ్లు కోటి రూపాయల మార్క్ ని కూడా అందుకోలేకపోతుందంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో బాలకృష్ణ నటించిన 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు 'రూలర్' సినిమా వాటికి ధీటుగా పతనం చూస్తోంది.

సర్వీస్ టాక్స్: రూ.25 లక్షలు చెల్లించిన అనసూయ..!

తొలిరోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లకు పైగా షేర్ సాధించింది. మాములుగా అయితే బాలయ్య రేంజ్ కి అవి తక్కువ వసూళ్లనే చెప్పాలి. ఇక రెండో రోజు అందులో నాల్గవ వంతు షేర్ కూడా రాకపోవడం దారుణం. ఏపీ, తెలంగాణాలో కలిపి కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాలేదు.

శనివారం రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.94 లక్షల షేర్ మాత్రమే సాధించింది. అందులో బాలయ్యకి క్రేజ్ ఉన్న రాయలసీమ నుండి వచ్చింది రూ.26 లక్షలే.. తెలంగాణా మొత్తం జిల్లాల్లో కలిపి రూ.30 లక్షలు. వెస్ట్ రూ.5 లక్షలు, ఈస్ట్ రూ.6 లక్షలు, గుంటూరు రూ.7 లక్షలు, కృష్ణా రూ.5 లక్షలు షేర్ అంటే బాలయ్య పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో చెప్పడానికి ఈ లెక్కలు సరిపోవు.

ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి వచ్చేలా లేవు. అక్కడ సినిమాకి అసలు బిజినెస్ లేక ఫ్రీగా ఇచ్చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios