రీసెంట్ గా కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు సంబంధించిన వార్తలను యాంకర్లు సుమ, అనసూయ ఇద్దరూ ఖండించారు.

అనసూయ అయితే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మీడియాని ఏకిపారేసింది. అయితే అనసూయ పాతిక లక్షల టాక్స్ చెల్లించిందని ఇంకా రూ.55 లక్షలు చెల్లించాల్సివుందని జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ ఇంటలిజెన్స్ హెడ్ బాలాజీ మజుందార్ ప్రముఖ ఆంగ్ల పత్రికతో ఈ విషయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

'ప్రతిరోజూ పండగే' మూడు రోజుల కలెక్షన్స్ !

సర్వీస్ టాక్స్ కి సంబంధించి అనసూయ రూ.35 లక్షల వరకు చెల్లించలేదని.. దానికి వడ్డీ పెరిగి మరో పదిహేను లక్షలు యాడ్ అయిందని చెప్పారు. ఆమె సరైన సమయానికి టాక్స్ చెల్లించకపోవడంతో పెనాలిటీతో కలిపి మొత్తం రూ.80 లక్షలు అయిందని తెలిపారు. ఈ మొత్తంలో ఆమె పాతిక లక్షలు మాత్రమే చెల్లించిందని.. మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సివుందని అన్నారు.

దీనికి సంబంధించి ఆమెకి నోటీసులు కూడా పంపినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని అనసూయ వద్ద ప్రస్తావించగా..  జీఎస్టీకి ముందు, 2013-14లో, చట్టం యొక్క అజ్ఞానం కారణంగా తను నిర్ణీత మొత్తాన్ని చెల్లించలేదని చెప్పింది. తనకు తెలియజేయాల్సిన నిర్మాతలు ఆ విషయాన్ని చెప్పలేదని.. ఆ సమయంలో తను పన్ను పరిధిలోకి రాలేదని చెప్పింది.

నిర్ణీత సమయంలో ప్రిన్సిపల్‌ అమౌంట్ ని చెల్లించినట్లయితే అప్పుడు జరిమానా లేదా ఆలస్య రుసుము ఉండదని.. తను అదే కోవలోకి వస్తానని వెల్లడించింది. అధికారుల నుండి తనలు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పింది. 2019 మేలో అధికారులు తన ఇంటిపై సోదాలు జరిగినప్పుడు కూడా వారికి ఎలాంటి డబ్బు దొరకలేదని చెప్పింది. జీఎస్టే వచ్చిన తరువాత తను కరెక్ట్ గానే టాక్స్ చెల్లిస్తున్నట్లు తెలిపింది.