నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం 'రూలర్‌'. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి సమర్పణ. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తూంటే  సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. రెండు వైవిధ్యమైన షేడ్స్‌ ఉన్న పాత్రలలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాలకృష్ణ లుక్స్‌ను చిత్ర యూనిట్‌ ఇటీవల విడుదల చేసింది.  

ఈ లుక్‌లలో బాలకృష్ణ చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా కనపడుతున్నారు. పర్టికులర్‌గా ఈ లుక్‌ కోసం బాలకృష్ణ బరువు కూడా తగ్గారు.  దాంతో వీటికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన కొత్త విషయం బయిటకు వచ్చింది.

ఫ్లాప్ హీరోయిన్ కి భారీ రెమ్యునరేషన్.. అడ్డు చెప్పని బాలయ్య?

ఈ  సినిమా లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేసారని, అది సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ అంటున్నారు. దాదాపు 500 మంది ఫైటర్స్ తో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను శంషాబాద్ సమీపం లో సెట్ వేసి షూట్ చేశారట. ఆ ఫైట్ లో  బాలయ్య ఉగ్రంగా ఊగిపోతూ చెప్పే డైలాగులు, ఫైట్ ఖచ్చితంగా అభిమానులకు పండుగే అంటున్నారు.  ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఆ పాత్ర స్వభావానికి, దూకుడుకీ ‘రూలర్‌’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని చెప్తున్నారు.  
 
 అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్‌ 20న విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 'జైసింహా' తర్వాత ఇదే కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్లు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.