టైమ్ బాగోపోవటం అంటే సినిమా వాళ్ల దృష్టిలో తాము నటించిన సినిమాలు ఆడకపోవటమే. గత సంవత్సరం ప్రారంభం నుంచి  బాలయ్య సినిమాలు మూడు రిలీజ్ అయ్యినా ఒక్కటీ ఆడలేదు. అంతేకాదు బాలయ్య డ్రస్ ల మీదా, విగ్ ల మీదా కామెడీ మొదలైంది. ఎన్నడూ లేనంతగా బాలయ్యపై నెగిటివ్ కామెంట్స్ వినపడ్డాయి. మరో ప్రక్క బోయపాటితో అనుకున్న సినిమా లాంచ్ అయినా ఇంకా ప్రారంభం కాలేదు.

ఈ నేపధ్యంలో జాతకాలు, జ్యోతిష్యాలు నమ్మే బాలయ్య తన టైమ్ బాగోలేదని నమ్ముతున్నారట. ఈ మేరకు ఆయన జపాలు చేయిస్తున్నారని, గ్రహ శాంతిలు చేయిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే జాతకం బాగోలేదు అనుకున్నప్పుడల్లా ఇలా చేయటం బాలయ్యకు అలవాటే అని అంటున్నారు.

బాలయ్య సినిమా రిజెక్ట్ చేసిన క్రేజీ హీరోయిన్.. అక్కడే తేడా వచ్చింది!

ఇదిలా ఉంటే ప్రస్తుతం బోయపాటి తో చేస్తున్న చిత్రం నిమిత్తం పది కోట్లు రెమ్యునేషన్ గా ఫిక్స్ చేస్తే ..దాన్ని ఇప్పుడు సగానికి తగ్గించుకోమని చెప్తున్నారట. ఐదు కోట్ల ఇవ్వగలమని బోయపాటితో నిర్మాత చెప్పిస్తున్నట్లు టాక్. ఇప్పటికే బోయపాటి తన రెమ్యునేషన్ తగ్గించుకున్నాడని అంటున్నారు.

అంతేకాదు డబ్బే కోట్లు అనుకున్న బడ్జెట్ ని నలభై కోట్లకు తీసుకురావటానికి తన వంతుగా స్క్రిప్టు మొత్తం తిరగరాస్తున్నాడని అంటున్నారు. బాలయ్య కూడా రూలర్ సినిమా డిజాస్టర్ అవటంతో ఆలోచనలో పడినట్లు...రెమ్యునేషన్ తగ్గించుకుని, నిర్మాతకు సహకరిస్తారని, తిరిగి ఎగ్రిమెంట్ రాసుకుందామని అన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.