బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్.. ఈ సారి యాక్షన్‌ని వదిలేస్తాడా?
బోయపాటి చిత్రం తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారంటూ న్యూస్ హల్చల్ చేసింది. ఇంతలో మరో వార్త చక్కర్లు కొడుతుంది.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ లో పూనకం వచ్చేలా చేసింది. ఓ డిఫరెంట్ లుక్‌లో బాలయ్య కనిపించారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వైరస్ వల్ల చిత్రీకరణ నిలిచిపోయింది. త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య కొత్త సినిమాల విషయంలో దూకుడు పెంచుతున్నాడు.
బోయపాటి చిత్రం తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారంటూ న్యూస్ హల్చల్ చేసింది. ఇంతలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. `చందమామ కథలు` వంటి జాతీయ అవార్డు చిత్రాన్ని రూపొందించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం బాలయ్య, ప్రవీణ్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ప్రవీణ్ సత్తారు రాజశేఖర్‌తో `పీఎస్వీ గరుడవేగ` రూపొందించి హిట్ అందుకున్నారు. ఫ్లాపుల్లో ఉన్న రాజశేఖర్‌కి హిట్ ఇచ్చి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. అయితే `గరుడవేగ` తర్వాత ప్రవీణ్ నెక్ట్స్ సినిమా ఏదీ సెట్ కాలేదు. సుధీర్‌బాబుతో వెటరన్ బాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మూడేళ్ళవుతున్నా, ఇది పట్కాలెక్క లేదు. అంతేకాదు ఇటీవల ప్రవీణ్ సత్తార్.. నాగార్జున హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. దీంతో గోపీచంద్ బయోపిక్ లేనట్టే అనే వార్త వినిపిస్తుంది.
ఇక ఇప్పుడు నాగార్జున సినిమా తర్వాత బాలకృష్ణ సినిమా చేసే అవకాశం ఉందట. అయితే బాలయ్యతో సినిమా రెగ్యులర్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్లా కాకుండా, తన స్టయిల్లో ఓ కొత్త జోనర్లో ప్రవీణ్ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే సెట్ అయితే ఓ కొత్త బాలయ్యని చూస్తామని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. బట్ ఈ వార్త మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది.