బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన  'రూలర్' డిసెంబర్ 20 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షోకే తేడా టాక్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా థియేటర్ కు వెళ్ళిన అభిమానులను పూర్తి స్దాయిలో నిరాశపరిచింది. వారి అంచనాలను కొంచెం కూడా అందుకో లేకపోయింది.  రివ్యూలు.. మౌత్ టాక్ అంతా నెగెటివ్ గా ఉండడం తో సినిమా కలెక్షన్స్ రెండో రోజు నుంచి దారుణం గా పడి పోవటం మొదలైంది. ఈ నేపధ్యంలో బాలయ్య నెక్ట్స్ సినిమాపైనే అందరి దృష్టీ పడింది. బోయపాటి దర్శకత్వంలో రెడీ అవనున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ బయటకు వచ్చింది.

రాయ్ లక్ష్మి బికినీ అందాలు.. మతిపోవాల్సిందే!

‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను బాలయ్య చెప్తూ తన కొత్త సినిమాని రీసెంట్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే.‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌గా పేరుపొందిన బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ చిత్రం పూజ జరిగింది. NBK106గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం జనవరి 3 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. షూటింగ్ ఏప్రియల్ 22 వ తేదీకి పూర్తి చేసి, మే 21న సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమాని రిలీజ్ చేయటానికి సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విలన్‌గా శ్రీకాంత్, లేడీ విలన్‌గా రోజా, కీలక పాత్రలో సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారని గాసిప్‌లు గుప్పుమంటున్నాయి.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. దీంతో బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌ సూపర్‌హిట్‌ అనే మార్క్‌ ఏర్పడింది. ఈ మేరకు మరో హిట్‌ కొట్టాలని బోయపాటి స్క్రిప్టును సిద్ధం చేసారట. ఇంట్రస్టింగ్ కథను రెడీ చేసారని చెప్తున్నారు. ఈ సినిమా ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో హిట్ కొడితే బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టినట్లే. మరి వీరి కాంబినేషన్ లో వచ్చే ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.