సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ పక్క రాజకీయాలతో మరోపక్క టీవీ షోలతో ఎంతో బిజీగా గడుపుతోంది రోజా. ఈ క్రమంలో తన పిల్లలు సమయం కేటాయించలేకపోతున్నానంటూ ఎమోషనల్ అయింది.

సంక్రాంతి కానుకగా ప్రముఖ ఛానెల్ 'అమ్మ నాన్న ఓ సంక్రాంతి' అనే స్పెషల్ ప్రోగ్రామ్ ని రూపొందించింది. జనవరి 15న ప్రసారమైన ఈ షోలో తమ తల్లితండ్రులను ఉద్దేశించి పిల్లలంతా పాట పాడి వినిపించారు. ఈ పాట తరువాత రోజా తన కొడుకుతో 'మమ్మీ అంటే భయం లేదా..?' అని అడిగింది.

హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ దాడులు..!

దానికి ఆమె కొడుకు.. 'నువ్వంటే ప్రేమ.. భయం లేదు' అంటూ బదులిచ్చాడు. ఆ ఆన్సర్ తో రోజా కంట నీరు ఆగలేదు. తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది.

ఒకవైపు షూటింగ్స్, మరోవైపు పాలిటిక్స్ తో బిజీగా ఉన్నప్పుడు తన పిల్లలు ఎంతో అర్ధం చేసుకుంటారని.. తను కష్టపడేది మొత్తం వాళ్లకోసమేనని.. కానీ వాళ్లు మాత్రం మాకు కావాల్సింది డబ్బు కాదు మమ్మీ, మీరు మాతో ఉంటడం కావాలని చెబుతుంటారని.. కొడుకుని పట్టుకొని భావోద్వేగానికి లోనైంది. రోజా కన్నీళ్లు చూసిన అక్కడి వారంతా కూడా ఎమోషనల్ అయ్యారు.