టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ గతేడాది 'రూలర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి షాకిచ్చాడు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో బాలయ్య కొంత గ్యాప్ తీసుకొని తన తదుపరి సినిమా మొదలుపెడుతున్నాడు.

బాలయ్యని వెండితెరపై అభిమానులు కోరుకునే విధంగా చూపించే దర్శకుడు బోయపాటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల బాలయ్య గుండు చేయించుకున్నారు. విగ్గు నప్పడం కోసమో.. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసమో బాలయ్య గుండు చేయించుకున్నారనే మాటలు వినిపించాయి.

హీరోయిన్ కి బాలయ్య ఫోన్, ఒప్పుకుంటుందా?

అయితే అసలు విషయం వేరే ఉందని సమాచారం. బోయపాటి సినిమాలో బాలయ్య రెండు పాత్రలు పోషించబోతున్నారని సమాచారం. అందులో ఒక పాత్ర కీలకంగా ఉంటుందని.. ఇంటర్వెల్ కి ముందు ఆ పాత్రని రివీల్ చేస్తారని చెబుతున్నారు. గతంలో బోయపాటి, బాలయ్య సినిమాల్లో ఇలాగే జరిగింది.

ఇంతకీ ఆ రెండో పాత్ర ఏంటో తెలుసా..? మన బాలయ్య తెరపై అఘోరగా కనిపిస్తారట. అభిమానులకు ఇది పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. సినిమాలో ఓ బాలయ్య పాత్రని చిన్నప్పటి నుండే అఘోరాలు కాశీలో పెంచి పెద్ద చేస్తారనే గాసిప్ వినిపిస్తోంది.

ఆ పాత్ర విశ్రాంతి ముందు రివీల్ అవుతుందని.. ఆ పాత్ర కోసమే బాలయ్య రెడీ అవుతున్నారని.. ముందుగా ఆ పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.