సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కొరత కొనసాగుతోంది. కొత్త హీరోయిన్స్ ...తమ వయస్సు కన్నా చాలా చిన్న వాళ్లు అవుతారు. పోనీ ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ని తెచ్చుకుందామంటే వాళ్లు ఫేడవుట్ అయిపోయి ఉంటారు. ఏం చేయాలో అర్దం కాని పరిస్దితిలో సీనియర్స్ ,వాళ్లను డైరక్ట్ చేసే దర్శకులు కొట్టిమిట్టాడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య ..తను బోయపాటితో చేయబోయే చిత్రానికి హీరోయిన్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మొదట కేధరిన్ ని అనుకున్నా...ఆమె నో చెప్పేసింది. నయనతార తను తెలుగులో సినిమాలు చేసేందుకు డేట్స్ ఖాళీ లేవంది. మిగతా హీరోయిన్స్ తో వర్కవుట్ కావటం లేదు. ఈ క్రమంలో బోయపాటి దృష్టి అంజలిపై పడిందని సమాచారం. అయితే తమిళంలో తాను బిజీగా ఉన్నానని చెప్పిందిట. దాంతో స్వయంగా బాలయ్యే ఆమెకు ఫోన్ చేసారని చెప్పుకుంటున్నారు.

అంజలికు ఒళ్లు ఉండటంతో .. బాలయ్య ప్రక్కన ఏజ్ గ్యాప్ ఏమంత కనిపించదని దర్శక,నిర్మాతలు భావించారట. యంగ్ హీరోల ప్రక్కన తనకు ఎలాగూ ఛాన్స్ వచ్చేటట్లు లేదు. దాంతో తను సీనియర్లకు సరిజోడీనే అని ఫిక్సైంది అంజలి. దానికి తోడు ఆమె వయస్సు కూడా 35కు దగ్గర పడుతోంది. కాబట్టి ఇదే బెస్ట్ అని ఆమె ఫిక్సైందని సమాచారం.  అన్నిటికన్నా ముందు ఆమె చేతిలో తెలుగు సినిమాలు అసలు లేవు. ఈ నేపధ్యంలో  సీనియర్ హీరోలతో నటించినా అంజలికి తనకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని భావిస్తోంది. అయితే బాలయ్య సరసన  చేయటానికి ఆమె ఓకే చేసిందా లేదా? అన్నది తెలియాల్సి ఉందింకా. ప్రస్తుతం అంజలి తమిళ సినిమాలతో ఫుల్ టైమ్ బిజీగా ఉంది.

అలాగే గతంలో  అంజలి బాలయ్య సరసన ‘డిక్టేటర్’ అనే సినిమాలో కలిసి నటించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నాడు. అఘోరా పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాలోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. మొత్తానికి బాలయ్య సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’తో  పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ రావాలని ఫ్యాన్స్  ఎదురుచూస్తున్నారు.