అందం మాత్రమే కాదు.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే ప్రతిభతో సమంత సౌత్ లోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. సమంత కెరీర్ లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. కానీ సమంత రీసెంట్ గా నటించిన జాను చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. 

తమిళ సూపర్ హిట్ మూవీ 96కి జాను తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. శర్వానంద్ త్వరలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా సమంత నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ జాను ఫ్లాప్ తర్వాత.. శర్వా, సమంత కాంబో వర్కౌట్ కావడం లేదని చిత్ర యూనిట్ సమంతని తప్పించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. శర్వాకు జోడిగా సమంతని తప్పించి అదితి రావు హైదరిని ఎంపిక చేసినట్లు సదరు బాలీవుడ్ మీడియా సంస్థ పేర్కొంది. సమంత ఫ్లాప్ షో వల్లే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని కథనం వెలువడింది. 

'ఆపమ్మా ఆపు.. ఎప్పుడూ ఇదే పనా'.. ఎన్టీఆర్ లాగే మహేష్ కూడా!

దీనిపై హీరోయిన్ అదితి రావు హైదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమంత ఫ్లాప్ షో అని పేర్కొన్న సదరు మీడియా సంస్థపై సోషల్ మీడియాలో అదితి విరుచుకుపడింది. 'ఈ వార్త చూశాక నేను స్పందించడం తప్పనిసరి అనిపించింది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నటీ నటుల కష్టాన్ని ఎవరూ కాదనలేరు. వారి ప్రతిభ ఎక్కడికీ పోదు. దయచేసి ఇలాంటి కామెంట్స్ చేయకండి.. ఇలా ఆలోచించకండి అని అదితి రావు హైదరి ట్వీట్ చేసింది. 

సెక్సీ ఫోజులతో కుర్రాళ్ళకి కనువిందు చేస్తున్న శ్రీయ.. ఫొటోస్ వైరల్

ఇక మహాసముద్రం చిత్రంలో తాను నటించే విషయం గురించి ప్రస్తావిస్తూ.. దానిని అధికారికంగా దర్శకుడే ప్రకటిస్తే బావుంటుందని, అప్పటి వరకు వేచి చూడాలని అదితి రావు హైదరి పేర్కొంది.