విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా  డైరక్షన్ లో తెరకెక్కిన `అర్జున్‌ రెడ్డి` ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అదే స్థాయిలో సక్సెస్ అయ్యింది. దాంతో `అర్జున్‌ రెడ్డి`    సినిమా రీమేక్‌ హక్కుల కోసం గట్టి పోటి కనిపించింది. ఈ సినిమాను తమిళంతో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా రీమేక్‌ చేశారు. మొదట ఈ సినిమాను వర్మ పేరుతో స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తెరకెక్కించారు.

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఫ్లాప్.. అయితే ఏంటి..?

అయితే బాలా రూపొందించిన వెర్షన్‌ నిర్మాతలకు నచ్చకపోవటంతో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా మరో దర్శకుడితో తెరకెక్కించారు. వర్మ సినిమా పేరును ఆదిత్య వర్మగా మార్చి మళ్లీ రెడీ చేసి వదిలారు. అర్జున్‌ రెడ్డి ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందింది . రీసెంట్ గా విడుదలైన ఆదిత్య వర్మకు మంచి  టాక్‌ రావటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం నిర్మాతలు ఓ డెసిషన్ తీసుకున్నారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన వర్షన్‌ `వర్మ` సినిమాను ఇప్పుడు ఆన్‌లైన్‌ రిలీజ్‌ చేసే ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్‌ బాలాకు ఉన్న  క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు  ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి  అఫీషియల్ ఎనౌన్సమెంట్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే విక్రమ్ కొడుక్కి పెద్ద దెబ్బే.