సెలెబ్రిటీలని ఇబ్బందికి గురుచేసేలా సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కొందరు సైబర్ నేరగాళ్లు హీరోయిన్లని, ఇతర నటీమణులని టార్గెట్ చేస్తున్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేయడం, పోర్న్ సైట్స్, అడల్ట్ వెబ్ సైట్స్, డేటింగ్ వెబ్ సైట్స్ తో పోస్ట్ చేస్తున్నారు. 

నటి ఆశ్రిత వేముగంటి గుర్తుందిగా.. బాహుబలి చిత్రంలో అర్షిత.. అనుష్క వదిన పాత్రలో నటించింది. బాహుబలి 2 చిత్రంలో ఆశ్రిత పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఆశ్రిత వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర చిత్రంలో వైఎస్ విజయమ్మగా నటించింది. 

తాజాగా ఆశ్రిత ఓ డేటింగ్ వెబ్ సైట్ నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. కొందరు డేటింగ్ వెబ్ సైట్స్ లో అట్రాక్షన్ కోసం నటీమణుల ఫోటోలని, హాట్ ఫోటోలని సెక్స్ అప్పీల్ ఉండే విధంగా అసభ్యంగా ఉపయోగిస్తున్నారు. తాజాగా ఆశ్రిత ఫోటోలని కూడా ఓ వెబ్ సైట్ పోస్ట్ చేసింది. 

కరోనా విరాళాలు: ప్రభాస్ బాహుబలి.. ఏ హీరో ఎంతంటే...

ఆ ఫోటోలు ఇబ్బంది కలిగించే విధంగా ఉండడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. హద్దులు మీరేలా సదరు వెబ్ సైట్ ఆగడాలు ఎక్కువవుతుండడంతో ఆమె పోలీసులని ఆశ్రయించారు. తన ఫోటోల్ని పోస్ట్ చేయడంపై కేసు నమోదు చేశారు. 

ఇటీవల సదరు వెబ్ సైట్ ఆమె ఫోటోలని థంబ్ నైల్ గా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆశ్రిత కంటపడింది.