ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ గతంలో హీరోయిన్లతో డేటింగ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా మరోసారి తన లవ్ ఎఫైర్ తో వార్తల్లో నిలిచాడు. క్రికెటర్లకు సినిమా ఇండస్ట్రీతో మంచి బంధం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు హీరోయిన్లతో డేటింగ్ చేశాడు.

ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా ఆ తరహా వార్తల్లో నిలుస్తున్నారు. ఇది వరకే తన ప్లేబాయ్ కామెంట్స్ తో వివాదం పాలయ్యాడు రాహుల్.  ఒక  టాక్ షో లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి మాట్లాడగా, ఆ మాటలకు నవ్వుతూ ఉండడంతో రాహుల్ పై కూడా యాక్షన్ తీసుకున్నాడు.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ లో బ్రహ్మీ క్యారక్టర్..ఆయన్ని ఉద్దేశించేనా?

ఆ సమయంలో రాహుల్ బీసీసీఐ క్షమాపణలతో బయటపడ్డాడు. ఇక ఇప్పుడు రాహుల్ పేరు డేటింగ్ వార్తల్లో వినిపిస్తుంది. అది కూడా ఓ హీరోయిన్ తో.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? బాలీవుడ్ అలనాటి హీరో సునీల్ షెట్టి కూతురు అతియా షెట్టి. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతియా శెట్టి నటిగా క్లిక్ అవ్వలేకపోయింది.

కానీ రాహుల్ తో డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే అతియా పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా  కేఎల్ తామిద్దరి ఫొటోనూ పోస్టు చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ సాగుతుందనే వార్తలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అతియా.. తన వ్యక్తిగత జీవితం గురించి బయట మాట్లాడడం తనకు ఇష్టం లేదని చెప్పింది. స్నేహమైనా, రిలేషన్ అయినా, మరేదైనా తన పెర్సనల్ లైఫ్ విషయాల గురించి మాత్రం మాట్లాడనని, ప్రైవేట్ గానే ఉంచుతానని చెప్పింది.