Asianet News TeluguAsianet News Telugu

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ లో బ్రహ్మీ క్యారక్టర్..ఆయన్ని ఉద్దేశించేనా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయాలను, కులాలను కలిపి చేస్తూ తీసిన తాజా వివాదాస్పద చిత్రం..  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ . ఆ చిత్రం ట్రయిలర్ రీసెంట్ గానే విడుదలైంది.

Brahmanandam's character in Kamma Rajyam Lo Kadapa Redlu
Author
Hyderabad, First Published Nov 10, 2019, 5:08 PM IST

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయాలను, కులాలను కలిపి చేస్తూ తీసిన తాజా వివాదాస్పద చిత్రం..  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ . ఆ చిత్రం ట్రయిలర్ రీసెంట్ గానే విడుదలైంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ లను అభ్యంతరకరంగా చూపించాడు వర్మ అంటూ వివాదాలు చుట్టుముట్టాయి.  తన శిష్యుడు, ‘భైరవ గీత’ ఫేమ్ సిద్దార్థ తాతోలుతో కలిసి ఆయన తీసిన ఈ సినిమాను జనాలు మరీ లైట్ తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో పాత్రలంటూ విడుదల చేస్తున్న పోస్టర్స్ తో ఆసక్తి కలిగించి మాట్లాడేలా చేస్తున్నారు వర్మ.

వాస్తవానికి ఇలాంటి వివాదాస్పద సినిమాల్లో పేరున్న ఆర్టిస్టులు నటించడానికి ముందుకు రావడం కష్టం. కానీ ఈ సినిమాలో బ్రహ్మానందం, ఆలీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ వంటి పెద్ద ఆర్టిస్ట్ లు ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపించారు. ఇంతటి వివాదాస్పద సినిమాలో వీళ్లిద్దరూ నటించి ఉంటారని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే వీళ్లు ఏ పాత్రలు వేయబోతున్నారనేదే చర్చగా మారింది. ఈ నేపధ్యంలో సినిమాలో బ్రహ్మానందం ఉన్న సీన్ కు సంభదించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు వర్మ. ఆ ఫొటో చూసిన వారంతా హ్మానందం కేరక్టర్ ఓ పత్రికా, మరియు చానెల్ అధిపతిది అనే నిర్ణయానికి వచ్చేసారు. అదే సమయంలో అదే కాదు బ్రహ్మీ పాత్ర ఓ ప్రముఖ వ్యాపార వేత్త కమ్ పొలిటీషియన్ అనే కూడా వినపడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈ వారంలో  సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేసి, ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే బిజినెస్ స్పీడుగా జరగకపోవటంతో రిలీజ్ డేట్ మార్చే అవకాసం ఉందని అంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం వివాదాల విషయమై కోర్టులో కేసులు ఫైల్ అయ్యాయి.  దీనిపై కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.  అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. వర్మ గత చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా విడుదలకు ముందు చాలా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అయితే థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు సినిమాను అనుకున్న రీతిలో ఆదరించలేదు. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios