Asianet News TeluguAsianet News Telugu

`90 ml` రేపే రిలీజ్, ఆ భయంతోనే సెన్సార్ తో రాజీ!

చిత్రం కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవ‌దాస్‌`, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌లా చదువుకున్న వ్యక్తి   'ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌' గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. 

At last, censor board clears Kartikeya's 90ML
Author
Hyderabad, First Published Dec 5, 2019, 10:02 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఈ రోజు (డిసెంబర్ 5) రిలీజ్ కావాల్సి ఉన్న యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ సినిమా 90 ఎంఎల్ సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి భారీ ఆడియో, వీడియో కట్ లు సూచించింది సెన్సార్ బోర్డు. సినిమా విడుదలకు ఒక్కరోజే ఉన్న  సమయం లో సినిమా విడుదల కోసం దిగివస్తుందా.. లేకపోతే వేరే ప్రయత్నాలు చేస్తుందా అని మీడియా, సినీ ఇండస్ట్రీ  మొత్తం ఎదురుచూసారు.

అయితే, వాటికి మొదట చిత్ర యూనిట్ నిరాకరించినా తర్వాత మళ్ళీ రివిజన్ కు వెళ్ళి సెన్సార్ సర్టిపికేట్ తెచ్చుకునేసరికి రిలీజ్ లేటవుతుంది. దాంతో గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోట్ చేయటానికి పెడుతున్న ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని భావించి ఓకే చేసినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం అనుకున్న రిలీజ్ తేదికు ఒక రోజు లేటుగా అంటే రేపు (డిసెంబర్ 6న) విడుదల అవుతోంది.


నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ "90ml ని మొదట డిసెంబరు 5 న విడుదల చేద్దాం అనుకున్నాము కానీ , కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6 కి మార్చుకున్నాం. పూర్తిగా కొత్త కథ కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కమెర్షియల్, ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ అంశాలతో రాబోతుంది. మా బ్యానర్ కి పేరు తెచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం `RX100` ని మించిన హిట్ అవుతుందని మా ప్రగాఢ నమ్మకం’’ అని చెప్పారు.

అల్లు అర్జున్ ప్లాన్ కి అడ్డుగా మారిన త్రివిక్రమ్..?

చిత్రం కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవ‌దాస్‌`, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌లా చదువుకున్న వ్యక్తి   'ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌' గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. యూత్ కి కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు, కార్తికేయ డాన్సులు, డైలాగులు, ఫైట్స్ ట్రైలర్ లో కనిపించడంతో ప్రేక్షకుల్లో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.ఈచిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్ ని శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థఫ్యాన్సీ ఆఫ‌ర్‌కి సొంతం చేసుకుంది.

నేహా సోలంకిని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలకి, ప్రమోషనల్ టూర్లకి మరియు ప్రీ రిలీజ్ ఈవెంటుకి అనూహ్య స్పందన వచ్చింది. పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, కెమెరా: జె.యువ‌రాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌, ఫైట్స్: వెంక‌ట్‌.

Follow Us:
Download App:
  • android
  • ios