స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. డిసెంబర్ నుండి సుకుమార్ సినిమాకి డేట్స్ ఇచ్చేస్తారని అనుకున్నారు. అల్లు అర్జున్ కూడా అలానే ప్లాన్ చేసుకున్నాడు. అదే విషయాన్ని సుకుమార్ కి కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ త్రివిక్రమ్ కారణంగా ఫ్లాప్ అయినట్లు తెలుస్తోంది.

ఇంకా 'అల.. వైకుంఠపురములో' సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం కోసం గెటప్ మార్చ్గుకోవడానికి కూడా తీరిక లేక ఇబ్బంది  పడుతున్నాడు. 'అల వైకుంఠపురములో' సినిమా పూర్తయితే కానీ బన్నీ పని ముందుకు సాగదు.

రివర్స్ లో వర్మని ఆడుకుంటున్న సెన్సార్, ఇంకో ట్విస్ట్

పైగా రెండు వారాలైనా 'అల.. వైకుంఠపురములో' సినిమాకి ప్రమోషన్స్ చేయాలి. కాబట్టి అవన్నీ పూర్తయిన తరువాతే సుకుమార్ సినిమా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఈలోగా అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకి తగ్గట్లు గడ్డం, హెయిర్ కాస్త పెంచి తన స్టైల్ మారుస్తాడు. జనవరి నెలాఖరులో కానీ షూటింగ్ కి వెళ్ళదు కనుక ముందుగా అనుకునట్లు 
సినిమాని వేసవికి విడుదల చేసే ఛాన్స్ ఉండదు.

ఇతర పెద్ద సినిమాలు పోటీ లేకపోతే ఆగస్ట్ లో విడుదల చేస్తారు. లేదా దసరాకి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్ 'అల.. వైకుంఠపురములో' సినిమాని ఈ ఏడాది అక్టోబర్ కి పూర్తి చేస్తానని చెప్పాడు. కానీ రెండు నెలల ఎక్స్ ట్రా టైం తీసుకున్నాడు. ఆ కారణంగా సుకుమార్ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. సుకుమార్ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది.