Asianet News TeluguAsianet News Telugu

కత్రినా కైఫ్ కొత్త బాయ్ ఫ్రెండ్.. అతడేనా..?

'రాజీ', 'సంజు', 'ఉరి' వంటి చిత్రాల్లో నటించిన విక్కీ కౌశల్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా అతడికి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ
 

Are Vicky Kaushal and Katrina Kaif secretly in a relationship
Author
Hyderabad, First Published Nov 1, 2019, 11:05 AM IST

సినిమా ఇండస్ట్రీలోలో ఎఫైర్లు, రూమర్లు చాలా కామన్. కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్తే.. మరికొన్నిమధ్యలోనే తెగిపోయాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కి కూడా గతంలో కొన్ని ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి వాళ్లతో కత్రినా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

రణబీర్ తో తనది బ్యాడ్ బ్రేకప్ అంటూ కత్రినా నేరుగా పలు సార్లు చెప్పింది. ఇప్పుడు ఈ బ్యూటీ మరో హీరోతో ఎఫైర్ పెట్టుకుందంటూ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.అతడు మరెవరో కాదు.. విక్కీ కౌశల్. 'రాజీ', 'సంజు', 'ఉరి' వంటి చిత్రాల్లో నటించిన విక్కీ కౌశల్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

రేయ్ కార్తీ.. నేను కూడా ఇలాంటి సినిమా చేస్తా.. ఖైదీకి రవితేజ ఫిదా!

ముఖ్యంగా అతడికి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. 'లస్ట్ స్టోరీస్'లో విక్కీ చేసిన పాత్ర కూడా ఇంతడి క్రేజ్ ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. ఇప్పుడు విక్కీ పేరు కత్రినా కైఫ్ జతలో వినిపిస్తూ ఉంది. కత్రినా కైఫ్ కొత్త లవర్ విక్కీనే అంటూ ప్రచారం జరుగుతోంది. దీపావళి సెలబ్రేషన్స్ లో ఇద్దరూ కలిసి కనిపించడం ఆ రూమర్లకు మరింత ప్రచారాన్ని కల్పిస్తూ ఉంది.

ఒక కామన్ ఫ్రెండ్ ఇంట్లో వీరిద్దరూ కలిసి దీపావళి జరుపుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కత్రినాకి ఈ తరహా వార్తలు అలవాటు అయినప్పటికీ విక్కీకి మాత్రం ఈ తరహా వార్తలు కొత్తనే చెప్పాలి. నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రాసెస్ లో విక్కీ చాలా కష్టపడుతున్నాడు. బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో 'భూత్', 'సర్దార్ ఉదం సింగ్' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios