కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ. మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రమంగా ఖైదీ చిత్రం పాజిటివ్ టాక్ తో ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ప్రకాష్ బాబు, ప్రభు, వివేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఖైదీ తెలుగు వర్షన్ ని ప్రముఖ నిర్మాత రాధామోహన్ రిలీజ్ చేశారు.  అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఇటీవల హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. 

తెలుగువాళ్ళకు కథ నచ్చితే ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని కార్తీ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడం చాలా సంతోషాన్నిస్తోందని కార్తీ తెలిపాడు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కార్తీని మాస్ యాంగిల్ లో ప్రజెంట్ చేశాడు. 

ఇక ఈ చిత్రానికి తెలుగు స్టార్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నట్లు కార్తీ తెలిపాడు. అడవి శేష్ ఫోన్ చేసి అభినందించాడని కార్తీ తెలిపాడు. రవితేజ భయ్యా కూడా ఫోన్ చేశాడు. కార్తీ.. ఖైదీ సినిమా చూశానురా. చాలా బావుంది. నేను కూడా ఇలాంటి సినిమా చేస్తా.. అప్పుడు నువ్వు నా సినిమా చూడాలి అని అన్నారు. తప్పకుండా భయ్యా అని బదులిచ్చినట్లు కార్తీ మీడియాకు వివరించాడు.