సాహో చిత్రం ముగిసిన కథ. ప్రభాస్ అభిమానులకైతే ఈ చిత్రం ఓ చేదు అనుభవం. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు దాదాపు సాహో కోసం రెండేళ్ల పాటు ఎదురుచూశారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ నార్త్ లో ప్రభాస్ కు ఉన్న మార్కెట్ పరిధిని ఈ చిత్రం తెలియజేసింది. 

దాదాపు 350 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం గురించి ఇప్పటికి కొన్ని సంగతులు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా అనుష్క గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సాహో చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చేసిన స్పెషల్ సాంగ్ యువతని బాగా ఆకట్టుకుంది. ఆ సాంగ్ లో జాక్వెలిన్ అందాలు ఎలా ఆరబోసిందో అందరికీ తెలిసిందే. 

ఈ సాంగ్ కోసం ముందుగా అనుష్కని అనుకున్నారట. అనుష్క, ప్రభాస్ లది సూపర్ హిట్ జోడి. బాహుబలి తర్వాత మరోసారి ప్రభాస్, అనుష్క వెండితెరపై కనిపిస్తే హైప్ బాగా ఉంటుందని చిత్రయూనిట్ భావించింది. అనుష్క కూడా ఆ స్పెషల్ సాంగ్ లో పెర్ఫామ్ చేసేందుకు అంగీకారం తెలిపిందట. అదే సమయంలో అనుష్క నిశ్శబ్దం షూటింగ్ లో బిజీగా ఉంది. ఆ చిత్ర నిర్మాత కోన వెంకట్ కూడా అనుష్క కోసం షూటింగ్ అడ్జెస్ట్ చేసేందుకు ఓకే అన్నారు. 

ప్రేమించుకుంటారు.. కానీ విడాకులు రద్దు చేసుకోరా!

కానీ దాని వల్ల ఇతర నటీనటుల డేట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఒక్క స్పెషల్ సాంగ్ కోసం నిశ్శబ్దం షూటింగ్ ఇబ్బందికి గురికాకూడదని చివరకు అనుష్క తన నిర్ణయాన్ని విరమించుకుంది. ఆ తర్వాతే సాహో చిత్ర యూనిట్ జాక్వెలిన్ ని సంప్రదించారు. అంటే ప్రభాస్ కోసం వెండితెరని హీటెక్కించడానికి కూడా అనుష్క సిద్ధపడిందన్నమాట.