ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల బయోపిక్ లను తెరకెక్కించారు. ధోనీ బయోపిక్ క్లిక్ అవ్వడంతో ఇప్పుడు మన ఫిల్మ్ మేకర్స్ స్పోర్ట్స్ మీద పడ్డారు. సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్ ఇలా స్పోర్ట్స్ కి సంబంధించిన వ్యక్తుల జీవితాలతో బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా నటి అనుష్క శర్మ కూడా ఓ బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషించడానికి అనుష్క అంగీకరించినట్లు సమాచారం.

వైరల్ ఫోటోలు : నడివయస్సులోనూ కుర్రాళ్ల నరాలు లాగేస్తోంది!

2002లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన టీమిండియా లెజెండ్ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి తన 18 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు చవిచూసింది. ఝులన్ గోస్వామి 2010లో అర్జున అవార్డు తో పాటు పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకుంది. 2002లో తొలి వన్డే మ్యాచ్ ఆడిన ఈమె ఇటీవల టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించింది.

ఓ పక్క భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా రూపొందుతోంది. ఈ సినిమాలో నటి తాప్సీ మిథాలీరాజ్ పాత్రను పోషిస్తోంది. 'శభాష్ మిథు' అనే పేరుతో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇటు అనుష్క శర్మ కూడా ఝులన్ గోస్వామి బయోపిక్ లో నటించనుండడంతో రెండు బయోపిక్ లో త్వరలోనే ప్రేక్షకులను అలరించనున్నాయి.