టాలీవుడ్ హీరోలతో పాటు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ అనుష్క. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది అనుష్క. టాలీవుడ్ లో ఆమె మార్కెట్ కూడా స్థిరంగా ఉంటుంది. 'అరుందతి', 'రుద్రమదేవి', 'బాహుబలి', 'భాగమతి' వంటి సినిమాలు నటిగా ఆమె స్థాయిని పెంచాయి.

కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలంటే దర్శకనిర్మాతలకు ముందుగా ఆమే గుర్తొస్తుంటారు. అంతలా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లతో మంచి మార్కెట్ ఏర్పరచుకుంది. దానికి తగ్గట్లే ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.

రూ.100 కోట్ల డైరెక్టర్.. పట్టించుకోని హీరోలు!

ఆమె తన తర్వాతి సినిమా 'నిశ్శబ్దం' కోసం తీసుకున్న రెమ్యునరేషన్ పై పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం అనుష్క రూ.3.5 కోట్లు అందుకున్నారని సమాచారం. దక్షిణాదిలో నయనతార తరువాత ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి అనుష్క అని చెబుతున్నారు.

నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాల కోసం రూ.6 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ గా తీసుకుంటుంది. ఇప్పుడు అనుష్క కూడా అదే రేంజ్ లో సినిమాకి మూడున్నర కోట్లు చార్జ్ చేస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది.

హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మాధవన్ , షాలిని పాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి రచయిత కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.