'సూపర్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి పద్నాలుగేళ్లవుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇన్నేళ్లలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా స్వీటీ రేంజ్ ని రీచ్ అవ్వలేకపోయారు. 

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న అనుష్క మార్కెట్ స్థాయి కూడా పెరుగుతోంది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.

నిశ్శబ్దంతో మళ్ళీ మోసం చేస్తున్న అనుష్క!

జనవరి 31న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమా విడుదల తేదీ మారుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 20న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.

ఈ నెల 31న 'అశ్వథామ' విడుదలవుతోంది. ఆ తరువాత ఫిబ్రవరి 7న శర్వానంద్ 'జాను', ఫిబ్రవరి 14న విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలపై కాస్త బజ్ ఏర్పడింది.

అందుకే పోటీ లేకుండా సోలోగా రావాలని ఫిబ్రవరి 20న విడుదల చేయాలని భావిస్తోంది 'నిశ్శబ్దం' టీమ్. ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా కనిపించనుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే కీలకపాత్రల్లో నటిస్తున్నారు.