Asianet News TeluguAsianet News Telugu

నిశ్శబ్దంతో మళ్ళీ మోసం చేస్తున్న అనుష్క!

అందరు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటే అనుష్క మాత్రం స్టార్ హీరోల్లనే అభిమానులను నీరాశపరుస్తోంది. ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజ్ చేస్తుంది అనుకుంటే అసలు ఏ మాత్రం ఆలోచించకుండా సైలెంట్ గా షూటింగ్ ల సాకుతో తప్పించుకుంటోంది. 

anushka nishabdam movie release postponed
Author
Hyderabad, First Published Jan 21, 2020, 8:51 AM IST

స్టార్ హీరోయిన్స్ అందరు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటే అనుష్క మాత్రం స్టార్ హీరోల్లనే అభిమానులను నీరాశపరుస్తోంది. ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజ్ చేస్తుంది అనుకుంటే అసలు ఏ మాత్రం ఆలోచించకుండా సైలెంట్ గా షూటింగ్ ల సాకుతో తప్పించుకుంటోంది. ప్రస్తుతం అనుష్క కోన వెంకట్ ప్రొడక్షన్ లో నిశ్శబ్దం అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

anushka nishabdam movie release postponed

ఈ సినిమా కోసం ఆడియెన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా స్వీటీ.. సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా కనిపించి మంచి కిక్ ఇచ్చింది. ఇకపోతే ఆమె నిశ్శబ్దం సినిమా ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది. ఫస్ట్ లుక్ తోనే ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. అయితే సినిమా జనవరి 31న రిలీజ్ అవుతున్నట్లు ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు.

anushka nishabdam movie release postponed

ఇటవల ఆడియెన్స్ నుంచి వస్తున్న డిమాండ్ కి అనుష్క నిశ్శబ్దం వీడి స్పందించక తప్పలేదు. సంక్రాంతి హాలిడేస్ అనంతరం ఆమె సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు గత ఇంటర్వ్యూలో చెప్పింది.కానీ ఇంకా ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. చూస్తుంటే సినిమా దాదాపు వాయిదా పడ్డట్లే అని అర్ధమవుతోంది.

anushka nishabdam movie release postponed

ఇక నిశ్శబ్దం సినిమా విషయానికి వస్తే.. మాధవన్ ఒక సెలబ్రెటీ మ్యూజిషియన్ గా అంథోని అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక - అంజలి - హాలీవుడ్ యాక్టర్ మైకేల్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios