తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చిత్రం ‘బాహుబలి’. రీసెంట్ గా లండన్‌లోని ప్రఖ్యాత ‘రాయల్‌ ఆల్బర్ట్ హాల్‌’లో ప్రదర్శితమైన నాన్‌-ఇంగ్లీష్‌ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి,  ప్రభాస్‌, రానా, అనుష్క సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, నిర్మాత శోభుయార్లగడ్డ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చిట్‌చాట్‌లో అనుష్క మాట్లాడింది.

‘బాహుబలి’ సీక్రెట్స్ రివీల్ చేసిన ప్రభాస్, రాజమౌళి

అనుష్క మాట్లాడుతూ... రాజమౌళిగారు బాహుబలి  కథ చెప్పిన విధానం నేను ఇప్పటికీ మర్చిపోలేను. అన్ని ఎమోషన్స్‌ను ఆయన చేసి చూపించారు. నా ఒళ్లు గగుర్పొడిచింది. దేవసేన పాత్రకోసం అనేక రకాల మేకప్‌ టెస్ట్‌ చేశారు. ముఖ్యంగా పార్ట్‌-1లో మేకప్‌ కోసం హాలీవుడ్‌ నుంచి నిపుణులు వచ్చారు. బందీగా ఉన్న దేవసేన వయసు పెరిగినట్లు చూపించాలి. ఆ ఫీల్‌ ప్రేక్షకుడికి కలగాలి. అదే సమయంలో తల్లి పాత్రను చేస్తే ఎవరు ఏమనుకుంటారోనని నేను ఏమాత్రం భావించలేదు.


దేవసేన పాత్రలో ఒక మహిళ పూర్తి జీవితం ఉంటుంది. ఆ పాత్రకు ప్రతి మహిళ కనెక్ట్‌ అవుతుందని భావించాం. ఎందుకంటే ఆ పాత్రలో చాలా ఎమోషన్స్‌ ఉంటాయి. ఇక సినిమా ఇంత భారీ విజయం సాధిస్తుందని మొదట్లో మేము అనుకోలేదు. షూటింగ్‌ చేయడానికి ముందే మాకు మా పాత్రలకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు సెట్‌ వచ్చిన తర్వాత తెలిసింది. మనం ఓ భారీ చిత్రంలో నటిస్తున్నామని. బాహుబలి జర్నీని చాలా ఆస్వాదించాం  అంటూ చెప్పుకొచ్చారు అనుష్క