‘బాహుబలి’ సీక్రెట్స్ రివీల్ చేసిన ప్రభాస్, రాజమౌళి

First Published 22, Oct 2019, 2:59 PM

ఒకప్పుడు తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవ‌ల‌సి వ‌స్తే శివ‌కి ముందు శివ త‌ర్వాత అనే పరిస్దితి. ఇప్పుడు సీన్ మారింది. టాలీవుడ్ ప్రస్దావన వస్తే  బాహుబలికి ముందు బాహుబ‌లి త‌ర్వాత, కలెక్షన్స్ విషయానికి వస్తే..నాన్ బాహుబలి రికార్డ్ లు అని అంటున్నాం. 

ఒకప్పుడు తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవ‌ల‌సి వ‌స్తే శివ‌కి ముందు శివ త‌ర్వాత అనే పరిస్దితి. ఇప్పుడు సీన్ మారింది. టాలీవుడ్ ప్రస్దావన వస్తే  బాహుబలికి ముందు బాహుబ‌లి త‌ర్వాత, కలెక్షన్స్ విషయానికి వస్తే..నాన్ బాహుబలి రికార్డ్ లు అని అంటున్నాం. అలా తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించిన బాహుబ‌లి చిత్రం ఇప్పటికి ఏదో విధంగా వార్తల్లో ఉంటోంది.

రీసెంట్ గా ఈ సినిమా మొద‌టి భాగాన్ని లండన్‌లోని ప్రతిష్టాత్మక ఆల్బర్ట్ హాల్‌లో శ‌నివారం ప్ర‌ద‌ర్శించారు . హాలీవుడ్ సినిమాలు కాకుండా.. రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్‌లో ప్ర‌ద‌ర్శిత‌మైన‌ తొలి తెలుగు చిత్ర‌మిదికావటంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇది తెలుగు సినిమాకు ద‌క్కిన గౌర‌వంగా చెప్తున్నారు.

ఈ నేపధ్యంలో బాహుబ‌లి మెయిన్ టీమ్ ప్ర‌భాస్‌, అనుష్క‌, రాజ‌మౌళి,రానా, శోభు యార్ల‌గ‌డ్డ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సినిమా ప్ర‌ద‌ర్శనకి ముందు చిత్ర టీమ్ సినిమాకి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్ర‌స్తావించారు.  ‘బాహుబలి’ కథను మొదట అనుకోలేదని, తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ మొదట శివగామి పాత్ర గురించి మాత్రమే చెప్పారని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.

‘బాహుబలి ఎలా మొదలైందో చెప్తూ... : రాజమౌళి మాట్లాడుతూ... మా నాన్నగారు మొదట ‘బాహుబలి’ కథ చెప్పలేదు. కేవలం శివగామి పాత్ర గురించి మాత్రమే చెప్పారు. ఆ తర్వాత భళ్లాలదేవుడు, కట్టప్ప పాత్రలు డవలప్ చేసారు, చివరకు బాహుబలి పాత్ర గురించి చెప్పారు. ఆ పాత్రల గురించి చెప్పినప్పుడు నాకు ఏదైతే ఇంట్రస్ట్ గా అనిపించిందో అదే ప్రేక్షకులకు కలిగించాలనే ప్రయత్నమే ఈ ఐదేళ్ల ‘బాహుబలి’ జర్నీ. అలా బాహుబలి మొదలైంది అంటూ వివరించారు.

ఇక తాను ఈ ప్రాజెక్టుకు ప్రభాస్‌ను ఎలా ఒప్పించానో చెప్తూ.. : రాజమౌళి మాట్లాడుతూ..అప్పటికే నేను ప్రభాస్‌తో ‘ఛత్రపతి’సినిమా  చేశాను. ఆ  టైమ్ లో మా ఇద్దరి మధ్య సినిమాలకు సంబంధించి అనేక విషయాలు చర్చకు వచ్చేవి. అదే మా మధ్య ప్రెండ్షిప్ మరింత బలపడేలా చేసింది. అలా మాట్లాడుకుంటూంటే..  తెల్లవారిపోయేది. మా మధ్య... సినిమాలు, జీవితం, భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్టులు చేయాలి? ఇలా మా మధ్య చర్చలు నడిచేవి. అప్పుడే  నేను ‘రాజులు.. యుద్ధాలు నేపథ్యంలో ఒక భారీ సినిమా తీయాలి’ అని  చెప్పా. వెంటనే ‘డార్లింగ్‌ నువ్వు అలాంటి సినిమా చేస్తే, నీకు ఎన్నిరోజులు డేట్స్‌ కావాలంటే అన్ని రోజులు ఇస్తా’ అని ప్రభాస్‌ నాతో అన్నాడు. అలా తర్వాత అది ‘బాహుబలి’గా చిత్రంగా పట్టాలెక్కింది.

రెండు భాగాలు వద్దన్నాను..: ఈ విషయమై కీరవాణి మాట్లాడుతూ..ఇంత భారీ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు రాజమౌళికి నన్ను వచ్చి కలిసాడు.‘ఒక భాగంగా తీద్దామా? లేక రెండు భాగాలుగా తీద్దామా? అని అడిగినప్పుడు నేను ఒక పార్ట్ గానే తీస్తే బాగుంటుందని సలహా ఇచ్చా. ఎందుకంటే ఇందులో అత్యధికమంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ పనిచేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అలా చెప్పా. అయితే ఆ తర్వాత రెండు భాగాలుగా తీశాం అన్నారు.

క్రేజ్ కు కారణం.. : అంతర్జాతీయంగా ‘బాహుబలి’ పాత్రకు అంత క్రేజ్‌ రావడానికి కారణం విషయమై ప్రభాస్ మాట్లాడారు. ఆయన చెప్తూ...అది కథలో ఉన్న బలం. ప్రేక్షకుల్లో రక రకాలు ఉంటారు. అలాంటి వారందరికీ నచ్చేలా రాజమౌళి ఆ పాత్రను డిజైన్‌ చేశారు. ఒక పిల్లాడి కోసం శివగామి పాత్ర త్యాగం చేయడంతో సినిమా మొదలవుతుంది. దీంతో ఆ పిల్లాడు ఎలా పెరిగి పెద్దవాడవుతాడనే ఆసక్తి ప్రేక్షకుడిలో పెరుగుతుంది అన్నారు.

12 ఏళ్ల క్రితమే.. : ప్రభాస్‌ కంటిన్యూ చేస్తూ...ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ప్రాంతీయ చిత్రం అన్ని ప్రాంతాల వారికీ నచ్చుతుందా? అన్న అనుమానం మాత్రం ఉండేది. అయితే, ‘బాహుబలిని’ అందరూ ఆదరించారు. ఈ సినిమాను రాజమౌళి 12ఏళ్ల కిత్రమే మొదలు పెట్టారు అని వివరించారు.

డిమాండ్ చేయలేదు : ‘బాహుబలి’ పాత్రను చేయమని రాజమౌళి డిమాండ్‌ చేయలేదు. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌ చాలా గొప్పది. చాలా కష్టపడి పనిచేస్తారు. సినిమా అంటే పిచ్చి ఆయనకు. దాంతో , కథలోని పాత్రలు మమ్మల్ని డిమాండ్‌ చేశాయి అని ప్రభాస్ చెప్పారు.