వరస పెట్టి గత సంవత్సరం బూతు సినిమాల జోరు కొనసాగింది. ఆర్ ఎక్స్ 100 హిట్ తర్వాత మొదలైన ఈ ప్రభంజనం...ఏడు చేపల కథ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ తో మరింత ఉత్సాహం తెచ్చుకుని రెచ్చిపోతోంది.మళ్ళీ కొత్త సంవత్సరంలోనూ ఆ హవా మొదలు కానుంది.  ‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి’ అనే టైటిల్ తో ఓ చిత్రం రాబోతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కు రంగం సిద్దమైంది. ఈ మేరకు నిర్మాత ప్రకటన రిలీజ్ చేసారు.

ఈ చిత్రం కథాంశం...  ఓ నలుగుర అమ్మాయిలు తన స్నేహితురాలి వివాహం కోసం  గోవా వెళ్లి అక్కడ ఓ మేల్ ఎస్కార్ట్ ని బుక్ చేసుకోవటం , ఓ రిసార్ట్ లో ఎంజాయ్ చేయాలనుకోవటం,అనుకోకుండా ఆ ఎస్కార్ట్ మర్డర్ అవటం చుట్టు తిరిగే క్రైమ్ కథ ఇది. అడల్ట్ కామెడీగా సాగే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే వదిలారు. ట్రైలర్ లో అమ్మాయిలతో కొద్ద్గిగా హాట్ డైలాగులే చెప్పించటంతో మంచి రెస్పాన్సే వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

అవమానంగా ఫీలైన పవన్ హీరోయిన్.. సోనాక్షి సిన్హాపై షాకింగ్ కామెంట్స్

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ.. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని' అన్నారు.  

ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు.