టాలీవుడ్ కుర్ర హీరో కార్తికేయ నటించిన '90ml' సినిమాని అడ్డుకుంటామని మద్యపాన నిషేధం పోరాట సమితి సభ్యులు ప్రకటించారు. ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితం కాకుండా శాంతియుతంగా అడ్డుకుంటామని తెలిపారు. సినిమా విడుదల సమయంలో ఐమాక్స్ థియేటర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని వెల్లడించారు.

శేఖర్ రెడ్డి  డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. కథ ప్రకారం సినిమాలో హీరో రోజుకి 90ml మందు తాగకపోతే చనిపోయే పరిస్థితి కలుగుతుంది. దీంతో అదే హీరోకి అలవాటుగా మారుతుంది.

సెక్సీ హీరో కాంపిటిషన్.. టాప్-10 లో ప్రభాస్!

సినిమా ట్రైలర్ మొత్తం మద్యం సేవించే సన్నివేశాలే ఎక్కువగా చూపించారు. దీంతో ఈ సినిమా మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఉందని.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ కావడానికి వీళ్లేదని పోరాట సమితీ సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలిపారు.

ఇలాంటి సినిమాల వలనే యువత పెడదోవ పడుతోందని.. మహిళలపై అఘాయిత్యాలకు కూడా ఇదే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో మద్యం సేవించే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమా పేరుని కూడా మార్చాలని చెప్పారు. కానీ అవేవీ జరగకపోవడంతో సినిమా రిలీజ్ అడ్డుకుంటామని అంటున్నారు. కార్తికేయ సొంత బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.