'ఏషియన్‌ సెక్సియెస్ట్‌ మేల్స్‌ 2019' లిస్ట్ లో ఒకడిగా నిలిచారు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్. బ్రిటిష్‌ ఈస్టర్న్‌ సంస్థ ఆన్‌లైన్‌ పోల్‌ ఆధారంగా బుధవారం లండన్‌లో విడుదల చేసిన ఈ జాబితాలో టాప్ 10 లో ప్రభాస్ ఉండడం విశేషం.

దక్షిణాది నుండి మరే హీరోకి ఈ లిస్ట్ లో చోటు దక్కకపోవడం, ఒక్క ప్రభాస్ మాత్రమే ఆ గౌరవం దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బ్రిటన్ కి చెందిన ఈస్టర్న్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల ఓట్లతో పాటు.. సోషల్ మీడియాలో వేడి పెంచుతూ.. ఈ ఏడాది ఎక్కువ ప్రభావం చూపిన హీరోలతో ఓ లిస్ట్ తయారు చేసింది.

బిగ్ బాస్ 4: మెగాస్టార్ VS జూనియర్ ఎన్టీఆర్..?

ఈ పోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అగ్ర స్థానంలో నిలిచారు. ఈ ఏడాది 'సూపర్‌ 30', 'వార్‌' చిత్రాలతో బాక్సాఫీస్‌ ని షేక్ చేసిన హృతిక్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా  మారాడు. గత పదేళ్లుగా సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తూ ఓవరాల్ ర్యాంకింగ్ లో ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నాడు హృతిక్.

ఇక ప్రభాస్ 'బాహుబలి' ఫ్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. 'సాహో' సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఈ ఏడాది ఎక్కువ బజ్ కలిగిన హీరో కూడా ఇతడే. 

పైగా ఈ ఏడాదిలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో  కొలువుదీరిన మొట్టమొదటి సౌతిండియన్ స్టార్ కూడా ప్రభాసే. ఈ అంశాలన్నీ ప్రభాస్ ని మోస్ట్ సెక్సీయస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో చోటు దక్కేలా చేశాయి. ప్రస్తుతం ప్రభాస్.. దర్శకుడు రాదాకృష్ణ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు.