టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతున్నప్పటికీ సంక్రాంతికి ఆ గ్యాప్ ని మర్చిపోయేలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకున్నట్లు అర్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుస ప్రమోషన్స్ తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలతో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాడు.

థమన్ మ్యూజిక్ - త్రివిక్రమ్ విజన్.. పాటల్లో స్పషంగా కనిపిస్తోంది. ఇప్పటికైతే మాస్ ఆడియెన్స్ అండ్ చిన్నపిల్లలు ఆల్ మోస్ట్ పాటలకు ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా పూర్తిగా సినిమావైపు లాగడానికి బన్నీ గ్యాంగ్ మారో సాంగ్ ని సిద్ధం  చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ప్రకారం 'డాడీ డాడీ' అనే సాంగ్ ని నెస్ట్విడుదల చేయబోతున్నారట.

ఇటీవల రాములో  రాములో పాట ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. సాంగ్ డోస్ అస్సలు తగ్గడం లేదు.  ఎలాంటి వేడుకలు జరిగినా అదే సాంగ్ వినబడుతోంది. ఇకపోతే మళ్ళీ అదే తరహాలో జనాలను ఆకర్షించే విధంగా సాంగ్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

read also:థమన్ గోల.. క్రిస్మస్ టూ సంక్రాంతి

సాంగ్ అనంతరం సినిమా టీజర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి థమన్ కెరీర్ లో మరో బెస్ట్ ఆల్బమ్ ని రెడీ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం థమన్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు వెంకీ మామ - డిస్కో రాజా వంటి సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. క్రిస్మస్ నుంచి పొంగల్ వరకు మొత్తం థమన్ పాటలే వినిపించనున్నాయని చెప్పవచ్చు.