మొదటి సినిమా కిక్ తోనే తన కసిని బయటపెట్టిన సంగీత సంచలనం థమన్ అప్పటి నుంచి నాన్ స్టాప్ మ్యూజిక్ తో రచ్చ చేస్తున్నాడు. ముఖ్యంగా రానున్న ఫెస్టివల్స్ లో థమన్ గోల మాములుగా ఉండదనిపిస్తోంది. ఇప్పటికే "అల.. వైకుంఠపురములో.." డిస్కోరాజా పాటలతో రచ్చ మొదలుపెట్టిన థమన్ జస్ట్ శాంపిల్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశాడు

.

అసలైన గోల ముందుంది.  క్రిస్మస్ - సంక్రాంతి పండగల్లో థమన్ సంగీతం అందిస్తున్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. సాయి ధరమ్ తేజ్ 'ప్రతి రోజు పండగే' - రవితేజ 'డిస్కో రాజా' సినిమాలకు థమన్ డిఫరెంట్ ట్యూన్స్ సెట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 20న క్రిస్మస్ టైమ్ లో సందడి చేయనున్నాయి. డిస్కో రాజా లోని వింటేజ్ సాంగ్ ఇప్పటికే రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.

అలాగే వెంకీ మామ సినిమాకు కూడా థమన్ ట్యూన్స్ సెట్ చేస్తున్నాడు.   ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ ఫెస్టివల్ సీజన్ లో రానున్నట్లు టాక్. ఇక సంక్రాంతి బిగ్ మూవీలో ఒకటైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్ 'అల..వైకుంఠపురములో..' సినిమతో థమన్ మరింత గోల పెట్టనున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ నాలుగు సినిమాలతో థమన్ కి డిఫరెంట్ ట్యూన్స్ సెట్ చేసే అవకాశం వచ్చింది. మరి ఆ సినిమాలతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.