90 వ దశకంలో దూరదర్శన్ ఛానల్ లో ఋతురాగాలు అనే సీరియల్ ప్రసారం అయ్యేది. అప్పటి నుంచే నటి అనితా చౌదరి గుర్తింపు సొంతం చేసుకుంది. సంతోషం, మన్మథుడు, ఛత్రపతి లాంటి చిత్రాల్లో అనిత నటించింది. అనిత యాంకర్ గా కూడా రాణించింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిత పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది. చిత్ర పరిశ్రమలో ఎదురైన ఇబ్బందులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో చౌదరిలకే ప్రాధాన్యత ఉంటుందనే ప్రచారం ఉంది. కానీ అలాటిదేమీ లేదు. నేను చౌదరి అయినప్పటికీ నాకు నా కులం ఏవిధంగానూ ఉపయోగపడలేదు. 

టీ గ్లాసుతో మెగా హీరో రచ్చ.. వీడియో సాంగ్ అదిరిందిగా!

యాంకరింగ్ చేస్తున్న సమయంలో కుక్క చాకిరీ చేయించుకున్నారు. అప్పట్లో నా పరిస్థితి ఆఫీస్ బాయ్ కి ఎక్కువ, యాంకర్ కి తక్కువ అన్నట్లుగా ఉండేది నా పరిస్థితి. నా పేరులో చౌదరిని తీసేయడానికి ప్రయత్నించా. కానీ అప్పట్లో అనిత పేరుతో చాలా మంది ఉన్నారు . దీనితో ఉంచేసుకున్నా. 

నా పెళ్ళికి స్వయంవరం ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురు హీరోలని పిలుస్తా: తమన్నా

యాంకర్ సుమ, ఉదయభాను లాంటి వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక నాగేశ్వరరావు దగ్గరి నుంచి అక్కినేని ఫ్యామిలీతో కూడా మంచి రిలేషన్ ఉంది అని అనిత పేర్కొంది. నాగార్జున గారిని నేరుగా వెళ్లి మీ తర్వాతి చిత్రంలో అవకాశం ఇవ్వండి అనేంత చనువు ఉందని అనిత తెలిపింది.