Asianet News TeluguAsianet News Telugu

రాజకీయనాయకుడితో సంబంధం అంటగట్టారు.. హీరోయిన్ కామెంట్స్!

 తన ప్రేమ, బ్రేకప్ విషయాల గురించి బయట చెబితే.. అందరూ వాటిని తప్పుగా అర్ధం చేసుకున్నారని.. రాజకీయాల్లో ఉన్న ఓ నటుడితో తనకు లింక్ చేసి వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేసింది. 

Andrea Jeremiah opens up on backlash about her past relationship
Author
Hyderabad, First Published Dec 26, 2019, 2:33 PM IST

సెలబ్రిటీలు సినిమాల గురించి తప్పించి తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఒకవేళ చెప్పినా.. కొందరు ఆ విషయాలపై అసభ్యకర కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ప్రముఖ నటి ఆండ్రియా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది.

తన ప్రేమ, బ్రేకప్ విషయాల గురించి బయట చెబితే.. అందరూ వాటిని తప్పుగా అర్ధం చేసుకున్నారని.. రాజకీయాల్లో ఉన్న ఓ నటుడితో తనకు లింక్ చేసి వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేసింది. తను 'బ్రోకెన్ వింగ్' అనే పుస్తకం రాశానని.. అందులో అన్నీ పద్యాలే ఉంటాయని చెప్పారు.

హైపర్ ఆది, యాంకర్ వర్షిణి మధ్య ఏం జరుగుతోంది ?

ఓ సారి బెంగుళూరులో జరిగిన లిటరరీ ఫెస్టివల్ కి వెళ్లినప్పుడు తన పుస్తకంలోని పద్యాలు చదివి వినిపించినట్లు చెప్పారు. ఆ సమయంలో చాలా మంది ఎవరి గురించి రాశారని అడిగితే.. నా మాజీ ప్రియుడు గురించి అని సమాధానం ఇచ్చినట్లు వెల్లడించింది. ఆ సమయంలో తను సెలబ్రిటీ అనే విషయాన్ని మర్చిపోయి సాధారణ అమ్మాయి మాదిరి ప్రేమకథను వివరించానని.. అదే నేను చేసిన పెద్ద తప్పు అంటూ చెప్పుకొచ్చింది.

ఈ విషయంలో చాలా మంది తనను తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపింది. ఆ ప్రభావం తనపై బాగా పడిందని.. చాలా రోజుల పాటు ఇంట్లో నుండి బయటకి రాలేకపోయానని తెలిపింది. అందుకే సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి తక్కువగా మాట్లాడతారాని.. త్వరలోనే ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తానని చెప్పారు.

ఈ పుస్తకంలో తన మాజీ ప్రియుడి గురించి కాదని.. కాకపోతే ఇందులో తన ప్రేమ విషయాలు, అందులో ఓడిపోయిన సంగతులు, తను కన్న కలల గురించి ఉన్నాయని అన్నారు. తన ప్రేమ గురించి చెప్పగానే చాలా మంది ఓ రాజకీయ నాయకుడితో సంబంధం అంటగట్టారని.. ఆ సమయంలో ఎలా స్పందించాలో అర్ధం కాలేదని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios