'కండనాళ్ ముదల్' చిత్రంతో కోలీవుడ్ కి పరిచయమైన నటి ఆండ్రియా. 'పచ్చైకిళి ముత్తుచ్చరం' చిత్రంలో శరత్ కుమార్ కి జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్తితో 'ఆయిరత్తిల్ ఒరువన్', అజిత్ తో 'మంగాత్త', కమల్ హాసన్ తో 'విశ్వరూపం', 'ఉత్తమ విలన్', ధనుష్ తో 'వడ చెన్నై' చిత్రాల్లో నటించింది.

'వడచెన్నై' సినిమాలో పడక సన్నివేశాల్లో ఆండ్రియా నటనపై అప్పట్లో వివాదాస్పదం కావడంతో తరువాత ఆ సన్నివేశాన్ని చిత్రం నుండి తొలగించారు. అయినా సామాజిక మాధ్యమాల్లో అది లీక్ అయింది. ప్రస్తుతం 'మాళిగై', 'మాస్టర్', 'అరణ్మనై 3' చిత్రాల్లో నటిస్తున్న ఆండ్రియా పడక సంనివేశామలో నటించడంపై స్పందించింది.

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక్క ట్వీట్ తో టెన్షన్ తీసేసాడు!

ఆ సన్నివేశంలో అలా కనిపించడంతో ఎక్కువగా అలాంటి అవకాశాలే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మంచి కథ, పాత్ర ఉంటే రెమ్యునరేషన్ తగ్గించుకొని నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. 

కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ తనొక పెళ్లైన హీరోతో డేటింగ్ చేశానని.. అతడితో బ్రేకప్ తనను డిప్రెషన్ లోకి వెళ్లేలా చేసిందని సంచలన కామెంట్స్ చేసింది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో పుస్తకం రాసిన ఆండ్రియా దాన్ని మార్కెట్ లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. కానీ కొందరు వ్యక్తులు అది జరగకుండా అడ్డుకుంటున్నారని వాపోయింది.