ఇప్పటికే ప్రభాస్ చాలా స్లోగా ప్రాజెక్టులు చేస్తున్నారని, బాహుబలి తర్వాత ఎంతో ఎక్సపెక్ట్ చేసిన సాహో చాలా టైమ్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయిందని, అలాగే రాధాకృష్ణతో చేస్తున్న చిత్రం సైతం లేటవుతోందని వారి కంప్లైంట్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,యంగ్ డైరక్టర్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో చిత్రానికి ఇప్పటికే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎనౌన్సమెంట్ వచ్చిన వెంటనే ఈ సినిమాపై రకరకాల రూమర్స్ మీడియాలో మొదలయ్యాయి. ఈ కాంబోలో రూపొందేది ఓ పీరియడ్ చిత్రం అని, 2023లో రిలీజ్ అవుతుందని, షూటింగ్ కు గ్రాఫిక్స్ కు చాలా సమయం తీసుకుంటారని ఆ వార్తల సారాంశం. ఇవి సహజంగానే ప్రభాస్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టాయి.
ఇప్పటికే ప్రభాస్ చాలా స్లోగా ప్రాజెక్టులు చేస్తున్నారని, బాహుబలి తర్వాత ఎంతో ఎక్సపెక్ట్ చేసిన సాహో చాలా టైమ్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయిందని, అలాగే రాధాకృష్ణతో చేస్తున్న చిత్రం సైతం లేటవుతోందని వారి కంప్లైంట్. దాంతో ఇప్పుడీ ఈ సినిమా సైతం ఎప్పుడో రెండేళ్ల తర్వాత రిలీజు అవుతుందనేది అనేగానే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అయితే ఈ విషయం గమనించిన నాగ అశ్విన్ ...రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదంటూ ట్వీట్ చేసారు. అది ఇప్పుడు వైరల్ అయింది.
ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.. 2021 చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని అశ్విన్ ట్వీట్ చేశారు. ఇప్పుడే సినిమా గురించి మాట్లాడటం సరికాదు…కొంతమంది ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు… ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్‌ను ఎప్పుడో దాటేశారు… ఆయనదిప్పుడు పాన్ వరల్డ్ స్థాయి అని ట్వీట్ లో పేర్కొన్నారు.
‘మహానటి’తో జాతీయ అవార్డును దక్కించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తన 21వ చిత్రం చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మించనున్నారు.
‘వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని చెప్పడానికి గర్విస్తున్నాం’అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా టైటిల్, కథ, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
