ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారు. ఇటీవల కాథరిన్ త్రెసా, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నారు. రీసెంట్ గా రష్మిక కూడా ఓ కొత్త ఇల్లు తీసుకుంది.

ఇప్పుడు ప్రముఖ యాంకర్ సుమ కనకాల దంపతులు కూడా కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితమే ఈ ఇంటి గురించి చర్చలు సాగుతున్నాయి. సుమ, రాజీవ్ లు కొద్ది రోజుల నుండి ఓ విలాసవంతమైన ఇంటికి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారట.

యాంకర్ సుమ సంపాదనపై రాజీవ్ కనకాల కామెంట్స్!

దీంతో ఈ కొత్త ఇంటిని అత్యంత లగ్జరీగా, పక్కా వాస్తు ప్రకారం మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే గృహప్రవేశం కూడా జరగబోతుందని సమాచారం. అయితే ఇల్లు తీసుకొని చాలా రోజులైనప్పటికీ, ఇంట్లో పెద్దవారైన దేవదాస్ కనకాల చనిపోవడంతో గృహప్రవేశం వాయిదా పడింది.

ఆయన చనిపోయి ఏడాది కావొస్తుండడంతో ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్.. తన భార్య సుమ రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సుమ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయాలు తను పట్టించుకోనని.. తన భార్య సంపాదనపై అధికారం చెలాయించే టైప్ కాదని చెప్పుకొచ్చాడు.