ప్రముఖ నటి విజయశాంతి ఎప్పుడైతే 'చిన్న రాములమ్మ' అని పిలిచారో తన ఆనందానికి అవధుల్లేవని యాంకర్ శ్రీముఖి చెప్పుకొచ్చింది. బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఎన్నో షోలకు యాంకరింగ్ చేశారు.

అయితే ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'పటాస్' షో శ్రీముఖికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ షోతో ఆమెకి 'రాములమ్మ' అనే పేరొచ్చింది. అభిమానలంతా కూడా శ్రీముఖిని రాములమ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇటీవల శ్రీముఖి 'బిగ్ బాస్ 3' లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది.

మళ్ళీ ఏడిపించిన రాములమ్మ.. విజయశాంతి కామెంట్స్!

తాజాగా శ్రీముఖి.. సీనియర్ నటి విజయశాంతిని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సక్సెస్ స్టేజ్ పై లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తనను గుర్తుపట్టి 'చిన్న రాములమ్మ' అని పిలిచారని.. ఆ సమయంలో తన ఆనందానికి అవధుల్లేవని చెప్పుకొచ్చింది.

ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని.. 2019లో వృత్తిపరంగా తనకు మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయని.. చిరంజీవి గారి చేతుల మీద అవార్డ్ తీసుకోవడం.. అలానే 2020 ఆరంభంలో విజయశాంతిని కలవడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కెరీర్ పరంగా శ్రీముఖి ఎంతో బిజీగా గడుపుతోంది. వరుస షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I got a lot of opportunities to meet her! When we were shooting in the same studio! Sometimes when she was right beside my room! But god had different plans! Best ones of course! Today onstage, in front of thousands of people, on her comeback film‘s success meet, when she acknowledges me! Ah kick vere level ABBA! ❤️ Mee andaru nannu Sreemukhi nunchi TV industry Ramulamma chesaru! Kani eroju “The lady superstar” mana “Ramulamma” mana “Vijayashanti Garu” Epudaithe nannu “Chinna Ramulamma” ani pilicharo, naa anandaniki avadhulu levu! I was totally speechless! I’ll cherish this moment forever in life! 2019 professionally, Megastar Chiranjeevi garu gave me a best moment in life! And 2020 begins with Vijayashanti garu! Overwhelmed! Happy happier happiest!!!! ❤️☺️ PS- “Jai Ramulamma” ❤️ #sreemukhi #ramulamma #ladysuperstar #vijayashantigaru

A post shared by Sreemukhi (@sreemukhi) on Jan 17, 2020 at 8:16am PST