కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా థియేటర్ కు జనాలను రప్పించటం కోసం కోటి ఐడియాలు అంటూ రెచ్చిపోతున్నారు సినిమావాళ్లు. బూతు గత సంవత్సరంలో బాగా వర్కవుట్ అవటంతో అటువైపే దృష్టిపెడుతున్నారు చిన్న సినిమా నిర్మాతలు. ఏ జానర్ లో చిన్న సినిమా చేసినా వర్కవుట్ కావటం లేదని అడల్ట్ కామెడీ పేరుతో బూతుని దట్టించి టీజర్స్, ట్రైలర్స్ వదిలి యూట్యూబ్ లో దుమ్ము దులుపుతున్నారు.

ఏడు చేపల కథ మాదిగా మరో అడల్ట్ ఫిలిం 'కిస్' రాబోతోంది.  ఈ చిత్రానికి దర్శక నిర్మాత శివ. సినిమా టైటిల్ ని రొమాంటిక్ గా పెట్టి కంటెంట్ ని హాట్ గా లాగించినట్లున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో చర్చగా మారింది. తిడుతూనే ఈ ట్రైలర్ పై ఓ లుక్కేస్తున్నారు. మరీ ముఖ్యంగా దెయ్యం ఫోర్న్ వీడియోలు చూడటం, వయాగ్ర మింగటం వంటి ఐడియాలకు జోహార్లు అర్పిస్తున్నారు. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.దర్శకనిర్మాత శివ మాట్లాడుతూ.. ‘‘దెయ్యం వయాగ్రా మింగితే అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇంతవరకూ ఈ కాన్సెప్ట్‌తో ఏ భాషలో సినిమా రాలేదు. నూతన నటీనటులతో రూపొందిన ఈ చిత్రం విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.

టీజర్ నిండా అదే పనిలో ఉన్న జంటలు కనపడతారు. రీరికార్డింగ్ లో కిస్ కిస్ కిస్ అంటూ కోరస్ వినడపుతూంటుంది. ఇది చాలదన్నట్లు ఒకావిడ పాలల్లో టాబ్లెట్ కలిపి ఈ వయాగ్రాతో వర్కవుట్ చేసుకుంటానంటుంది. ఇంతలో హీరో ఫ్రెండ్ వచ్చి...ఏంటి దెయ్యం ఫోర్న్ చూస్తుందా అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తాడు.చివర్లో  'దెయ్యం వయాగ్రా మింగితే' అంటూ ట్యాగ్ లైన్ ఒకటి. ఇవన్నీ చదివాక టీజర్ చూడాలనిపిస్తోందా..ఇప్పటికే చూసేసారా...