ప్రముఖ యాంకర్ రవి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కారు మాత్రం డ్యామేజ్ అయింది. శనివారం నాడు మూసాపేట నుండి బంజారాహిల్స్ వైపు వస్తోన్న రవి కారుని భరత్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర ఓ డీసీఎం ఢీ కొట్టింది. 

ఈ విషయంపై రవి తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో వివరణ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ ని, క్లీనర్ ని పట్టుకొని ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు వారు మద్యం సేవించి ఉన్నారని.. తాను పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేశానని చెప్పారు.

తెలుగు తెరపై కొత్త రుచులు.. ఏడాది రచ్చ చేసిన హీరోయిన్లు వీరే!

పోలీసులు వచ్చేలోపు డీసీఎం డ్రైవర్, క్లీనర్ పారిపోయారని.. ఇలా మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని రవి ఆవేదన వ్యక్తం చేశారు. స‌న‌త్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో డ్రైవ‌ర్‌తో పాటు ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఓన‌ర్‌పై కూడా కేసు వేశానని ర‌వి తెలిపారు.