టాలీవుడ్ హాట్ యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏదో విధంగా రష్మీ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. టాలీవుడ్ గ్లామరస్ యాంకర్ గా రష్మీ బుల్లితెరపై దూసుకుపోతోంది. శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం జరగబోతోంది. వాలంటైన్స్ డే రోజు ప్రేమికుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ప్రేమికులు తమ బాయ్ ఫ్రెండ్ కి కానీ, గర్ల్స్ ఫ్రెండ్ కి కానీ వివిధ రకాల గిఫ్ట్స్ ని బహుకరిస్తారు. ఒక వేల తమ పార్ట్నర్స్ జంతు ప్రేమికులు అయితే పెంపుడు కుక్కలని, పిల్లులని, పక్షులని గిఫ్ట్స్ గా బహుకరిస్తారు. దీనిపై యాంకర్ రష్మీ సోషల్ ఇండియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

వాలంటైన్స్ డే గిఫ్ట్స్ గా పెంపుడు జంతువులు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి అని తెలిపింది. పెంపుడు జంతువులని గిఫ్ట్స్ గా ఇస్తే 10 నుంచి 15 ఏళ్ల వరకు వాటిని జాగ్రత్తగా రక్షించాలి. వాటితో ఎమోషనల్ గా అటాచ్ అవ్వాలి. కానీ కొందరు కొన్ని రోజులకే వాటిని పట్టించుకోవడం మానేస్తారు. గిఫ్ట్ ఎలా అయితే పాతబడితే నచ్చదో.. పెంపుడు జంతువులని కూడా అలాగే చూస్తారు. అది సరైంది కాదు. 

అందుకే కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువులని గిఫ్ట్స్ గా ఇచ్చే ముందు ఆలోచించుకుని ఇవ్వాలి అని యాంకర్ రష్మీ పేర్కొంది. 

చిరంజీవిని చూసే విలువలు పాటిస్తున్నాం.. పవన్ తో సినిమాపై బన్నీ కామెంట్స్!

ఇక సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి . కానీ తాము ప్రొఫెషన్ లో భాగంగానే అలా ప్రవర్తిస్తూ వినోదాన్ని అందిస్తున్నట్లు పలు సందర్భాల్లో రష్మీ పేర్కొంది. తాజాగా వాలంటైన్స్ డే స్పెషల్ ఎక్స్టా జబర్దస్త్ ప్రోమోలో సుధీర్, రష్మీ రచ్చ చేస్తున్నారు.రష్మీకి సుధీర్ లవ్ సింబల్ ఉన్న బెలూన్ గిఫ్ట్ గా ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది.